Snapchat చవిచూసిన ఈ ఎదుగుదల, ప్రజలు ఒక సురక్షితమైన మరియు భద్రమైన వాతావరణంలో తమను తాము సమర్థవంతంగా వ్యక్తపరచేందుకు, ఆ క్షణంలో జీవించేందుకు, ప్రపంచంగురించి తెలుసుకొనేందుకు, అందరితో కలిసి ఆనందంగా జీవనం సాగించేందుకు సాధికారత కల్పించే దిశగా మా లక్ష్యం కొనసాగుతుంది. దీనిని కొనసాగించేందుకు - సేవా నిబంధనలు, కమ్యూనిటీ మార్గదర్శకాలు వంటి సాధనాలతో, హానికారకమైన కంటెంట్‌ను నిరోధించడం, గుర్తించడం మరియు వాటిపై చర్యలు తీసుకోవడం వంటివి చేపట్టేందుకు మేము మా భద్రత మరియు గోప్యతా విధానాలను నిరంతరం ఉన్నతీకరిస్తుంటాము.
ఈ ప్రయత్నాలకు సరైన అంతర దృష్టి మరియు మా వేదికపై ఉండే కంటెంట్ స్వభావం మరియు పరిణామాలను వెల్లడిచేసేందుకు, మేము సంవత్సరానికి రెండుసార్లు పారదర్శకతా నివేదికలను ప్రచురిస్తాము. ఈ నివేదికలు మరింత సమగ్రంగా, ఆన్‌లైన్ భద్రత మరియు పారదర్శకతల పై ప్రత్యేక శ్రద్ధ వహించే వివిధ వాటాదారులకు సమాచారం అందించేందుకు మేము నిరంతరం శ్రద్ధ వహిస్తామని ఈ నివేదికలు ఉండేలా చూసుకొంటాము.
ఈ నివేదిక 2021లోని రెండవ అర్థభాగం (జూలై 1 - డిసెంబర్ 31) కాలాన్ని కవర్ చేస్తుంది. మా ఇంతకుముందరి నివేదికల మాదిరిగానే, ఇది ఏవైనా నిర్ధారిత ఉల్లంఘనలకు వ్యతిరేకంగా మేము స్వీకరించిన ఇన్-యాప్ కంటెంట్ మరియు అక్కౌంట్-స్థాయి నివేదికలు మరియు వాటిపై మేము తీసుకొన్న ప్రపంచ స్థాయి చర్యల సంఖ్యల సమాచారాన్ని; చట్టాన్ని అమలుపరచే సంస్థలు మరియు ప్రభుత్వాలనుండి మేము స్వీకరించిన అభ్యర్థనలు మరియు వాటిపై దేశంవారీగా మేం చేపట్టిన చర్యల వివరాలను పంచుకొంటుంది. ఈ నివేదిక Snapchat కంటెంట్ యొక్క ఉల్లంఘనా వీక్షణ రేటు, సంభావ్య ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలు, ప్లాట్‌ఫారంపై తప్పుడు సమాచారం అందించడం వంటి సంఘటనలవంటివి చేర్చబడినాయి.
మా నివేదికలలో పారదర్శకతను పెంపొందించేందుకు దృష్టి నిలపడంలో భాగంగా మేము ఈ నివేదికలో ఎన్నో నూతన అంశాలను ప్రవేశపెట్టాము. ఈ సంచికలో మరియు రాబోయే వాటిలో, మాదకచ్రవాలు, ఆయుధాలు మరియు నియంత్రిత వస్తువులను వాటి స్వంత విభాగాలుగా విభజించి, వాటి ప్రాబల్యం మరియు నియంత్రించేందుకు మేము చేపట్టే చర్యలగురించి అదనపు వివరాలను పొందుపరుస్తున్నాము.
మొట్టమొదటిసారిగా, మేము కొత్తగా ఆత్మహత్య మరియు స్వీయహాని నివేదిక విభాగాన్ని ఏర్పాటుచేసి, మొత్తం నివేదిక మరియు మేము స్వీకరించే అక్కౌంట్ నివేదికలలో మరియు వాటిపై మేం తీసుకొన్న చర్యల గురించి వివరించాము. మా కమ్యూనిటీ యొక్క శ్రేయస్సుకు మేమిచ్చే మద్దతు పట్ల మేము చూపే నిబద్ధతతో భాగంగా మా ట్రస్ట్ మరియు సేఫ్టీ బృందాలు, అవసరంలో ఉన్న Snapచాటర్లతో ఇన్-యావ్ వనరులను పంచుకొంటాము మరియు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ పంచుకొంటున్నాము.
ఆన్‌లైన్ హానులను ఎదుర్కోవడానికి మా పాలసీల గురించి, మా నివేదనా విధానాల గురించి మరింత సమాచారానికై, ఈ పారదర్శకతా నివేదిక పై మా ఇటీవలి భద్రతా & ప్రభావం బ్లాగ్‌ను చదవండి.
Snapchat పై భద్రత మరియు గోప్యతకు సంబంధించిన అదనపు వనరులను కనుగొనేందుకు పేజీ కింద ట్యాబ్‌లో ఉన్న మా పారదర్శకత రిపోర్టింగ్ గురించి ను చూడండి.
జులై 1 - డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న కాలంలో మేము, ప్రపంచవ్యాప్తంగా మా పాలసీలను ఉల్లంఘించిన 6,257,122 కంటెంట్ అంశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొన్నాము. తీసుకొన్న చర్యలలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించడం లేదా అటువంటి కంటెంట్ కలిగివున్న అక్కౌంట్‌ను తొలగించడంవంటివి ఉన్నాయి.
ఈ నివేదికా కాలంలో, ఉల్లంఘన వీక్షణ రేటు (VVR) 0.08 ఉన్నట్లుగా మేము గమనించాము అంటే Snapచాట్‌పైన రియు స్టోరీ వీక్షణలలో 8 మాత్రమే కంటెంట్‌కు సంబంధించిన మా మార్గదర్శకాలను ఉల్లంఘించినవి ఉన్నాయి.
మొత్తం కంటెంట్ & అక్కౌంట్ నివేదికలు
అమలు చేసిన మొత్తం కంటెంట్
అమలు చేసిన మొత్తం ప్రత్యేక అకౌంట్‌లు
12,892,617
6,257,122
2,704,771
కారణం
కంటెంట్ & అక్కౌంట్ నివేదికలు
అమలు పరచబడిన కంటెంట్
మొత్తం కంటెంట్ అమలు యొక్క %
అమలు చేయబడిన ప్రత్యేక ఖాతాలు
మధ్యగత టర్నరౌండ్ సమయం (నిమిషాలు)
అసభ్యకరమైన లైంగిక కంటెంట్
7,605,480
4,869,272
77.8%
1,716,547
<1
మాదకద్రవ్యాలు
805,057
428,311
6.8%
278,304
10
వేధింపులు మరియు బెదిరింపులు
988,442
346,624
5.5%
274,395
12
బెదిరింపులు & హింస
678,192
232,565
3.7%
159,214
12
స్పామ్
463,680
153,621
2.5%
110,102
4
విద్వేషపూరిత ప్రసంగం
200,632
93,341
1.5%
63,767
12
నియంత్రించబడిన ఇతర వస్తువులు
56,505
38,860
0.6%
26,736
6
స్వీయ హాని & ఆత్మహత్య
164,571
33,063
0.5%
29,222
12
ప్రతిరూపం
1,863,313
32,749
0.5%
25,174
<1
ఆయుధాలు
66,745
28,706
0.5%
21,310
8
మా కమ్యూనిటీలోని ఏ సభ్యుడినైనా, ముఖ్యంగా మైనర్లను లైంగికంగా దోచుకోవడం చట్టవిరుద్ధం, ఆమోదయోగ్యం కాదు మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాల ద్వారా నిషేధించబడింది. మా ప్లాట్‌ఫారంపై చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) ను నిరోధించడం, గుర్తించడం, మరియు తొలగిండమనేది మాకు అత్యంత ప్రాధాన్యమున్న అంశం మరియు CSAMను మరియు పిల్లలను లైంగికంగా దోపిడీని ప్రోత్సహించే కంటెంట్‌ను నిరోధించడానికి సంబంధించి అవసరమైన మా సామర్థ్యాలను పెంపొందించుకొనేందుకు మేము నిరంతరం కృషి చేస్తూ ఉంటాము.
మా ట్రస్ట్ మరియు సేఫ్టీ టీమ్‌లు CSAM యొక్క తెలిసిన చట్టవిరుద్ధమైన చిత్రాలు మరియు వీడియోలను గుర్తించడానికి మరియు వాటిని తప్పిపోయిన మరియు దోపిడీకి గురైన పిల్లల కోసం US నేషనల్ సెంటర్‌కు నివేదించడానికి ఫోటోDNA బలమైన హాష్-మ్యాచింగ్ మరియు Google యొక్క చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఇమేజరీ (CSAI) మ్యాచ్ వంటి క్రియాశీల సాంకేతిక గుర్తింపు సాధనాలను ఉపయోగిస్తాయి. (NCMEC), చట్టం ప్రకారం. ఆ తరువాత, NCMEC అవసరమని అనుకున్నట్లుగా దేశీయ లేదా అంతర్జాతీయ చట్టం అమలు తో సమన్వయం చేస్తుంది.
2021లోని రెండవ అర్థభాగంలో, ఇక్కడ నివేదించిన మొత్తం CSAM ఉల్లంఘనలలో 88 శాతం వాటిని మేము చురుగ్గా గుర్తించి, చర్యలు తీసుకొన్నాము.
మొత్తం ఖాతా తొలగింపులు
198,109
హానికరమైన కంటెంట్ విషయానికి వస్తే, విధానాలు మరియు అమలు గురించి ఆలోచించడం సరిపోదని మేము ఎల్లప్పుడూ విశ్వసిస్తున్నాము - ప్లాట్‌ఫారమ్‌లు వాటి ప్రాథమిక నిర్మాణం మరియు ఉత్పత్తి రూపకల్పనను పరిగణించాలి. ప్రారంభం నుండి, Snapchat సాంప్రదాయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటే భిన్నంగా నిర్మించబడింది, ఓపెన్ న్యూస్‌ఫీడ్ లేకుండా ఎవరైనా మోడరేషన్ లేకుండా ఎక్కువ మంది ఆడియన్స్ కు ప్రసారం చేయవచ్చు.
పౌర సంబంధ ప్రక్రియలను బలహీనపరచే; సరైన ఆధారం లేకుండా ఉండే వైద్యపరమైన క్లెయిమ్‌లు, విషాదకరమైన సంఘటనలను ఖండించే విధంగా ఉండే తప్పుడు సమాచారంతో సహా, హాని తలపెట్టే ఏవిధమైన తప్పుడు సమాచార వ్యాప్తినైనా మా మార్గదర్శకాలు స్పష్టంగా నిరోధిస్తాయి; మా మార్గదర్శకాలు మరియు అమలు అన్ని స్నాప్ చాటర్లకు స్థిరంగా వర్తిస్తాయి - మేము రాజకీయ నాయకులు లేదా ఇతర ప్రజా ప్రముఖులకు ప్రత్యేక మినహాయింపులు చేయము.
తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధిత మా మార్గదర్శనాల ఉల్లంఘనలకుగాను ఈ కాలానికి Snapchat ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14,613 అక్కౌంట్లు మరియు కంటెంట్ అంశాలపై చర్యలు తీసుకొంది.
మొత్తం కంటెంట్ & అకౌంట్ అమలు
14,613
నివేదించిన ఈ సమయానికిగాను, ఉగ్రవాద నిరోధం మరియు హింసాత్మక తీవ్రవాద సంబంధ కంటెంట్ ఉల్లంఘనకు పాల్పడిన 22 అక్కౌంట్లను మేము తొలగించాము.
Snapలో మేము వివిధ మార్గాలద్వారా నివేదించిన ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్‌ను తొలగించాము. వీటిలో యూజర్లు, మా ఇన్-యాప్ రిపోర్టింగ్ మెను ద్వారా ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్ గురించి యూజర్లు నివేదించేందుకు అనుమతించడంతోపాటు, Snapపై ప్రచురితమవడానికి అవకాశమున్న ఉగ్రవాద మరియు హింసాత్మక తీవ్రవాద కంటెంట్‌ను నిరోధించేందుకు చట్టాన్ని అమలుపరచే సంస్థలతో సన్నిహితంగా పనిచేస్తాము.
మొత్తం ఖాతా తొలగింపులు
22
మేము Snapchatters యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సుపట్ల చాలా తీవ్రంగా ఆలోచిస్తామనే మా ఉద్దేశ్యం, Snapchatను భిన్నంగా నిర్మించడంలో మేము స్వయంగా తీసుకొనే ఎన్నో నిర్ణయాలకు తార్కాణంగా నిలుస్తాయి. నిజమైన స్నేహితులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికై రూపొందించబడిన ఒక వేదికగా ఉన్న Snapchat, ఈ కష్టకాలంలో స్నేహితులు ఒకరికొకరు సహాయంగా ఉండేందుకు వారికి సాధికారత కల్పించడంలో ఒక భిన్నమైన పాత్ర పోషించగలదని మేము విశ్వసిస్తున్నాము.
ఎవరైనా ఒక Snap చాటర్ కుంగుబాటులో ఉన్నట్లు మా ట్రస్ట్ & సేఫ్టీ బృందం గుర్తించినట్లయితే, స్వీయ హాని నివారణ మరియు మద్దతు వనరులను అందించేదుకు మరియు అవసరమైన చోట అత్యవరమైన ప్రతిస్పందనా బృందానికి తెలియజేసే అవకాశాన్ని కలిగివుంటారు. మేము పంచుకొనే వనరులు, భద్రతా వనరుల ప్రపంచవ్యాప్త జాబితాలో ఉంటాయి మరియు ఇవి Snapchatters అందరికీ బహిరంగంగా అందుబాటులో ఉంటాయి.
ఆత్మహత్యా వనరులు పంచుకొన్న సందర్భాలు మొత్తం
21,622
ఈ విభాగం భౌగోళిక ప్రాంతాల నమూనాలను అనుసరించికమ్యూనిటీ మార్గదర్శకాలు అమలు యొక్క అవలోకనం అందిస్తుంది. మా మార్గదర్శకాలు Snapchat లోని అన్ని కంటెంట్ లకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని Snapchatter లకు, లొకేషన్ తో సంబంధం లేకుండా వర్తిస్తాయి.
జత చేయబడ్డ CSV ఫైల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వ్యక్తిగత దేశాల కొరకు సమాచారం లభ్యం అవుతుంది.
ప్రాంతం
కంటెంట్ నివేదికలు*
అమలు పరచబడిన కంటెంట్
ప్రత్యేక ఖాతాలు అమలు
నార్త్ అమెరికా
5,309,390
2,842,832
1,237,884
యూరోప్
3,043,935
1,450,690
595,992
మిగిలిన ప్రపంచం
4,539,292
1,963,590
668,555
మొత్తం
12,892,617
6,257,112
2,502,431