గోప్యతా పాలసీ

అమల్లోనికి వచ్చేది: 30 సెప్టెంబర్, 2021

Snap Inc. అనేది ఒక కెమెరా కంపెనీ. Snapchat, Bitmoji, Spectacles, అడ్వర్టైజింగ్ మరియు ఈ గోప్యతా పాలసీతో ముడిపడి ఉన్న వేరేవాటితో సహా—మా ఉత్పత్తు‌లు మరియు సేవలు—మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోడానికి, ఆ క్షణం గడపడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి, మరియు కలిసి వినోదించడానికి వేగవంతమైన మరియు ఆహ్లాదకరమైన మార్గాలను అందిస్తాయి!

మీరు ఈ సేవలను ఉపయోగించుకునేటప్పుడు, మీరు మాతో కొంత సమాచారమును పంచుకుంటారు. కాబట్టి, మేము సేకరించే సమాచారం, దాన్ని మేము ఎలా ఉపయోగిస్తాము, దాన్ని ఎవరితో పంచుకుంటాము, మరియు మీ సమాచారాన్ని ప్రాప్యత చేసుకోవడానికి, అప్‌డేట్ చేయడానికి మరియు తొలగించడానికి మేము మీకు ఇచ్చే నియంత్రణల గురించి మేము ముందుగా తెలియజేయాలని అనుకుంటున్నాము.

అందుకే మేము ఈ గోప్యతా పాలసీని వ్రాశాము. మరి అందుకనే మేము, ఈ డాక్యుమెంట్లను తరచుగా చుట్టుముట్టే చట్టబద్ధతా మేఘాల నుండి వీటిని పరమానందభరితమైన స్వేచ్ఛతో ఉండేలా వ్రాయడానికి ప్రయత్నించాము. అయినప్పటికీ, ఒకవేళ మీకు మా గోప్యతా పాలసీలోని దేని గురించైనా ప్రశ్నలు ఉంటే, కాస్త మమ్మల్ని సంప్రదించండి.

మీరు మా గోప్యతా పాలసీని సంపూర్ణంగా చదవాలి, ఐతే మీకు కేవలం కొద్ది నిముషాలే సమయం ఉండి లేదా ఆ తర్వాత కొంత జ్ఞాపకం ఉంచుకోవాలని అనుకున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ ఈ సారాంశమును చూడవచ్చు - తద్వారా మీరు కేవలం కొద్ది నిముషాల్లో కొన్ని ప్రాథమిక విషయాలను సమీక్షించవచ్చు.

మేము సేకరించే సమాచారం

మేము సేకరించే సమాచారంలో మూడు ప్రాథమిక కేటగరీలు ఉన్నాయి:

  • మీరు అందించే సమాచారం.

  • మా సేవలను మీరు ఉపయోగించేటప్పుడు మేము పొందే సమాచారం.

  • తృతీయ పక్షాల నుండి మేము పొందే సమాచారం.

ఈ కేటగరీలలో ప్రతిదానిపైన మరికొంచెం వివరంగా ఇక్కడ ఇవ్వబడింది.

మీరు అందించే సమాచారము

మీరు మా సేవలతో సంభాషించినప్పుడు, మీరు మాకు అందించే సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఉదాహరణకు, మా సేవలలో చాలా వాటికి మీరు ఒక Snapchat ఖాతాను ఏర్పరచుకోవలసిన అవసరం ఉంటుంది, కాబట్టి మేము మీ గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను సేకరించాల్సి ఉంటుంది, అవి: మీ పేరు, మీ యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్, ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వంటివి. మా సేవల్లో బహిరంగంగా కనిపించే ఒక ప్రొఫైల్ పిక్చర్ లేదా Bitmoji అవతార్‌ వంటి కొంత అదనపు సమాచారాన్ని మాకు అందించమని కూడా మేము మిమ్మల్ని అడగవచ్చు. వాణిజ్య ఉత్పాదనలు వంటి ఇతర సేవలు కూడా, మీరు మాకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు నంబరు మరియు దానితో ముడిపడి ఉన్న ఖాతా సమాచారాన్ని మాకు అందించమని కూడా మిమ్మల్ని కోరవచ్చు.

వాస్తవానికి, మీరు Snaps మరియు చాట్‌లు వంటి మా సర్వీసుల ద్వారా పంపించే సమాచారము ఏదైనా కూడా మాకు అందిస్తూ ఉంటారు. మీ Snapలు, చాట్‌లు మరియు ఏదైనా ఇతర కంటెంటును వీక్షించే వాడుకదారులు ఎల్లప్పుడూ ఆ కంటెంటును యాప్ కు వెలుపల సేవ్ చేసుకోవచ్చు లేదా కాపీ చేసుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి, ఇంటర్నెట్ కు ఏకమొత్తంగా వర్తించే అదే సామాన్యజ్ఞానం Snapchatకు కూడా వర్తిస్తుంది: మరొకరు సేవ్ చేసుకోకూడదని లేదా పంచుకోకూడదని మీరు కోరుకునే సందేశాలను పంపవద్దు లేదా కంటెంటు‌ను పంచుకోవద్దు.

మీరు కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించినప్పుడు లేదా మాతో ఏదైనా ఇతర మార్గములో మాట్లాడినప్పుడు, మీరు స్వచ్ఛందంగా అందించే లేదా మీ ప్రశ్నను పరిష్కరించడానికి మాకు అవసరమైన ఏదైనా సమాచారాన్ని మేము సేకరిస్తాము.

మీరు మా సేవలను ఉపయోగించునప్పుడు మేము పొందే సమాచారము

మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు, ఆ సేవలలో వేటిని మీరు ఉపయోగించుకున్నారు మరియు వాటిని ఎలా ఉపయోగించుకున్నారనే దాని గురించి మేము సమాచాముం సేకరిస్తాము. ఉదాహరణకు, మీరు ఒక నిర్దిష్ట Storyని చూశారని, ఫలానా కాలవ్యవధి పాటు ఒక నిర్దిష్ట ప్రకటనను చూశారని, కొన్ని Snapలను పంపారని మాకు తెలియవచ్చు. మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు మేము సేకరించే సమాచారం యొక్క రకాల పూర్తి వివరణ ఇదిగో:

  • వాడకపు సమాచారము. మా సేవల ద్వారా మేము మీ కార్యకలాపాల గురించిన సమాచారాన్ని సేకరిస్తాము. ఉదాహరణకు, మేము ఈ అంశాల గురించిన సమాచారమును సేకరించవచ్చు:

    • మీరు మా సేవలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, అనగా మీరు ఏ ఫిల్టర్లను చూస్తారు లేదా Snaps కు వర్తింపజేస్తారు, డిస్కవర్‌ పై మీరు ఏ Stories చూస్తారు, మీరు Spectacles ఉపయోగిస్తున్నారా లేదా మీరు ఏ శోధన ప్రశ్నలు సమర్పిస్తారు వంటివి.

    • మీరు ఇతర Snapchatters తో ఎలా కమ్యూనికేట్ చేస్తారు, అనగా వారి పేర్లు, మీ కమ్యూనికేషన్ల సమయం మరియు తేదీ, మీ స్నేహితులతో మీరు మార్పిడి చేసుకునే సందేశాల సంఖ్య, మీరు ఎక్కువగా ఏ స్నేహితులతో సందేశాలను మార్పిడి చేసుకుంటారు, మరియు సందేశాలతో మీ ఇంటరాక్షన్‌లు (మీరు సందేశాన్ని ఎప్పుడు తెరుస్తారు లేదా ఎప్పుడు స్క్రీన్ షాట్ తీస్తారు వంటివి) వంటివి.

  • కంటెంట్ సమాచారము. మా సేవలపై మీరు క్రియేట్ చేసే కస్టమ్ స్టిక్కర్లు వంటి కంటెంట్‌ని, మరియు మీరు క్రియేట్ చేసే లేదా అందించే కంటెంట్ గురించిన సమాచారాన్ని మేము సేకరిస్తాము, గ్రహీత కంటెంట్‌ని వీక్షించినట్లయితే మరియు కంటెంట్‌తో పాటుగా ఇచ్చిన మెటాడేటా వంటిదానిని మేము సేకరిస్తాము.

  • ఉపకరణ సమాచారము. మీరు ఉపయోగించే ఉపకరణాల నుండి మరియు వాటి గురించిన సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఉదాహరణకు, మేము వీటిని సేకరిస్తాము:

    • హార్డ్‌వేర్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్, డివైజ్ మెమరీ, అడ్వర్టైజింగ్ ఐడెంటిఫైయర్‌లు, విశిష్ట అప్లికేషన్ ఐడెంటిఫైయర్‌లు, ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లు, విశిష్ట డివైజ్ ఐడెంటిఫైయర్‌లు, బ్రౌజర్ రకం, ఇన్‌స్టాల్ చేయబడిన కీబోర్డులు, భాష, బ్యాటరీ స్థాయి మరియు టైమ్ జోన్ వంటి మీ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ గురించిన సమాచారము;

    • యాక్సిలరోమీటర్లు, గైరోస్కోప్‌లు, దిక్సూచిలు, మైక్రోఫోన్‌లు మరియు మీరు హెడ్‌ఫోన్‌లు కనెక్ట్ చేసుకున్నారా వంటి ఉపకరణ సెన్సార్ల నుండి సమాచారము; మరియు

    • మొబైల్ ఫోన్ నెంబర్, సేవా ప్రదాత, IP చిరునామా మరియు సిగ్నల్ సామర్ధ్యం వంటి మీ వైర్‌లెస్ మరియు మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్‌ల గురించిన సమాచారము.

  • ఉపకరణం ఫోన్‌బుక్. ఎందుకంటే Snapchat అంతా స్నేహితులతో కమ్యూనికేట్ చేయడమే కాబట్టి, మేము—మీ అనుమతితో—మీ ఉపకరణం యొక్క ఫోన్‌బుక్ నుండి సమాచారాన్ని సేకరించవచ్చు.

  • కెమెరా మరియు ఫోటోలు. మా సేవలలో అనేకం మీ ఉపకరణం యొక్క కెమెరా మరియు ఫోటోల నుండి మేము ఇమేజ్‌లు మరియు ఇతర సమాచారాన్ని సేకరించాలని కోరతాయి. ఉదాహరణకు, మేము మీ కెమెరా లేదా ఫోటోలను ప్రాప్యత చేసుకుంటే తప్ప, మీరు Snaps పంపించలేరు లేదా మీ కెమెరా రోల్ నుండి ఫోటోలను అప్‌లోడ్ చేయలేరు.

  • స్థానపు సమాచారము. మీరు మా సేవలను ఉపయోగించేటప్పుడు మేము మీ స్థానము గురించిన సమాచారమును సేకరించవచ్చు. మీ అనుమతితో, GPS, వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు, సెల్ టవర్లు, Wi-Fi యాక్సెస్ పాయింట్లు, మరియు గైరోస్కోప్స్, యాక్సిలోమీటర్లు, మరియు కంపాస్‌లు వంటి ఇతర సెన్సార్‌లతో సహా అటువంటి పద్ధతులను ఉపయోగించి మీ ప్రశస్తమైన స్థానము గురించిన సమాచారాన్ని కూడా మేము సేకరించవచ్చు.

  • కుకీలు మరియు ఇతర టెక్నాలజీలచే సేకరించబడే సమాచారము. అనేక ఆన్‌లైన్ సేవలు మరియు మొబైల్ అప్లికేషన్ల లాగానే, మీ చర్య, బ్రౌజర్, మరియు ఉపకరణము గురించిన సమాచారమును సేకరించడానికి మేము కుకీస్ మరియు వెబ్ బీకాన్స్, వెబ్ స్టోరేజ్, మరియు విశిష్ట అడ్వర్టైజింగ్ ఐడెంటిఫయర్లు వంటి ఇతర టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. అడ్వర్టైజింగ్ మరియు వాణిజ్య అంశాలు వంటి మా భాగస్వాములలో ఒకరి ద్వారా మేము అందించే సేవలతో మీరు సంభాషించునప్పుడు సమాచారమును సేకరించడానికి మేము ఈ టెక్నాలజీలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీకు మరింత సముచితమైన ప్రకటనలను చూపించడానికి ఇతర వెబ్ సైట్ లపై సేకరించిన సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. అత్యధిక వెబ్ బ్రౌజర్లు డిఫాల్ట్ గా కుకీలను స్వీకరించేలా అమర్చబడి ఉంటాయి. ఒకవేళ మీరు ప్రాధాన్యత ఇస్తే, మీరు మీ బ్రౌజర్ లేదా ఉపకరణంపై సెట్టింగ్స్ ద్వారా మామూలుగా బ్రౌజర్ కుకీలను తొలగించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అయినా, కుకీలను తొలగించడం లేదా తిరస్కరించడం అనేది మా సేవల లభ్యత మరియు ఫంక్షనాలిటీపై ప్రభావం చూపవచ్చునని మనసులో ఉంచుకోండి. మా సేవలు మరియు మీ ఎంపికలపై మేము మరియు మా భాగస్వాములు కుకీలను ఎలా ఉపయోగిస్తామో మరింత తెలుసుకోవడానికి, దయచేసి మా కుకీ పాలసీని చూడండి.

  • లాగ్ సమాచారము. మీరు మా వెబ్ సైట్ ని ఉపయోగించినప్పుడు, దిగువ పేర్కొన్న లాగ్ సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము:

    • మీరు మా సేవలను ఎలా ఉపయోగించుకున్నాారనే దాని గురించిన వివరాలు;

    • మీ వెబ్ బ్రౌజర్ రకం మరియు భాష వంటి ఉపకరణ సమాచారము;

    • ప్రాప్యత చేసుకున్న సమయాలు;

    • వీక్షించిన పేజీలు;

    • IP చిరునామా;

    • మీ ఉపకరణము లేదా బ్రౌజర్‌ను విశిష్టంగా గుర్తించే కుకీలు లేదా ఇతర సాంకేతికతలతో ముడిపడి ఉన్న ఐడెంటిఫైయర్‌లు; మరియు

    • మా వెబ్‌సైట్‌కు నావిగేట్ చేయడానికి ముందు లేదా ఆ తర్వాత మీరు సందర్శించిన పేజీలు.

తృతీయపక్షాల నుండి మేము సేకరించే సమాచారము

మేము ఇతర వాడుకదారులు, మా అఫిలియేట్లు, మరియు తృతీయ పక్షాల నుండి మీ గురించిన సమాచారమును సేకరించవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:

  • మీరు మీ Snapchat ఖాతాను మరొక సేవకు (Bitmoji లేదా తృతీయ-పక్ష యాప్ వంటివి)గనక లింక్ చేస్తే, మీరు ఆ సేవను ఎలా ఉపయోగిస్తారు వంటి సమాచారాన్ని మేము ఆ ఇతర సేవ నుండి అందుకోవచ్చు.

  • అదేవిధంగా అడ్వర్టైజర్లు, యాప్ డెవలపర్లు, ప్రచురణ కర్తలు, మరియు ఇతర తృతీయ పక్షాలు కూడా మాతో సమాచారాన్ని పంచుకోవచ్చు. ప్రకటనల యొక్క పని తీరును లక్ష్యం చేసుకోవడం లేదా లెక్కించడంలో సహాయపడటానికి ఇతర మార్గాలతో సహా మేము ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ రకమైన తృతీయపక్ష డేటా యొక్క మా వాడకం గురించి మీరు మా సపోర్ట్ సెంటర్ లో మరింతగా తెలుసుకోవచ్చు.

  • ఒకవేళ మరొక వాడుకదారు గనక తమ కాంటాక్ట్ జాబితాను అప్‌లోడ్ చేస్తే, మేము ఆ వాడుకదారు కాంటాక్ట్ జాబితా నుండి తీసుకున్న సమాచారాన్ని మేము మీ గురించి సేకరించిన ఇతర సమాచారంతో సమ్మిళితం చేయవచ్చు.

మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

మేము సేకరించిన సమాచారముతో మేము ఏమి చేస్తాము? సవివరమైన జవాబు కొరకు, ఇక్కడ చూడండి. సంక్షిప్త సమాధానం: మేము అవిశ్రాంతంగా మెరుగుపరచే ఉత్పత్తులు మరియు సేవల అద్భుతమైన కూర్పును మీకు అందిస్తాము. మేము దానిని చేసే మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

  • మా ఉత్పత్తులు మరియు సేవలను అభివృద్ధి చేస్తాము, ఆపరేట్ చేస్తాము, మెరుగుపరుస్తాము, పంపిణీ చేస్తాము, నిర్వహిస్తాము మరియు రక్షిస్తాము.

  • ఇమెయిల్‌తో సహా మీకు కమ్యూనికేషన్‌లు పంపిస్తాము. ఉదాహరణకు, మద్దతు విచారణలకు స్పందించడానికి లేదా మీకు ఆసక్తి కలిగించవచ్చని మేము భావించే మా ఉత్పత్తులు, సేవలు మరియు ప్రోత్సాహక ఆఫర్లు గురించి సమాచారాన్ని పంచుకోవడానికి మేము ఇమెయిల్ ని ఉపయోగించవచ్చు.

  • పోకడలు మరియు వాడకమును పర్యవేక్షిస్తాము మరియు విశ్లేషిస్తాము.

  • ఇతర విషయాల పైకీ, స్నేహితులు, ప్రొఫైల్ సమాచారం లేదా Bitmoji స్టిక్కర్‌లను సూచించడం, Snapchatters పరస్పరం Snapchat, అనుబంధ మరియు తృతీయ-పక్షపు యాప్‌లు మరియు సేవలలో కనుగొనేలా సహాయపడటం లేదా ప్రకటనలతో సహా మేము మీకు చూపించే కంటెంటును అనుకూలీకరించడం ద్వారా మా సేవలను వ్యక్తిగతీకరించడం.

  • ఇతర విషయాల పైకీ, మీ ప్రశస్తమైన స్థానపు సమాచారాన్ని ఉపయోగించి మీ మెమరీస్ కంటెంటు‌ను ట్యాగ్ చేయడం (బహుశా ఒకవేళ ఆ సమాచారాన్ని సేకరించడానికి మీరు మాకు అనుమతి ఇస్తేనే) మరియు కంటెంట్ ఆధారంగా ఇతర లేబుల్‌లను వర్తింపజేయడం ద్వారా మీ అనుభవాన్ని సందర్భోచితంగా చేయడం.

  • మా సేవల లోపల మరియు వెలుపల కూడా, మీ ప్రశస్తమైన స్థానపు సమాచారాన్ని ఉపయోగించడంతో (మళ్లీ, ఆ సమాచారాన్ని సేకరించడానికి మీరు మాకు అనుమతి ఇస్తేనే) సహా మా ప్రకటనల సేవలు, యాడ్ టార్గెటింగ్‌, మరియు యాడ్ కొలతలను అందించడం మరియు మెరుగుపరచడం. Snap Inc. యొక్క అడ్వర్టైజింగ్ పద్ధతులు మరియు మీ ఎంపికల గురించి మరింత సమాచారం కోసం ఈ దిగువన మీ సమాచారముపై నియంత్రణ విభాగమును చూడండి.

  • మా ఉత్పత్తులు మరియు సేవల యొక్క భద్రత మరియు రక్షణను పెంపొందించుట.

  • మీ గుర్తింపును సరిచూసుకోవడం మరియు మోసం లేదా ఇతర అనధికార లేదా చట్టవిరుద్ధమైన చర్యను నిరోధించడం.

  • మా సేవలు మరియు వాటితో మీ అనుభవాన్ని పెంపొందించడానికి కుకీస్ మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం నుండి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించడం.

  • మా సేవా నిబంధనలు మరియు ఇతర వాడుక పాలసీలను ఉల్లంఘించే ప్రవర్తనను ఖండించడం, దర్యాప్తు చేయడం మరియు నివేదించడం, చట్ట అమలు నుండి అభ్యర్థనలకు ప్రతిస్పందించడం మరియు చట్టపరమైన ఆవశ్యకతలతో సమ్మతి వహించడం.

Lenses యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి మేము Apple యొక్క TrueDepth కెమెరా నుండి కూడా సమాచారాన్ని ఉపయోగించవచ్చు. TrueDepth కెమెరా నుండి సమాచారము వాస్తవ సమయము‌లో ఉపయోగించుకోబడుతుంది—మేము దీనిని మా సర్వర్లపై నిల్వ చేసుకోము లేదా తృతీయ పక్షాలతో దాన్ని పంచుకోము.

మేము సమాచారాన్ని ఎలా పంచుకుంటాము

మేము మీ గురించిన సమాచారాన్ని ఈ క్రింది విధాలుగా పంచుకోవచ్చు:

  • ఇతర Snapchattersతో. మేము ఇతర Snapchattersతో ఈ క్రింది సమాచారాన్ని పంచుకోవచ్చు:

    • మీ యూజర్ నేమ్, పేరు మరియు Bitmoji వంటి మీ గురించిన సమాచారము.

    • మీ Snapchat “స్కోర్”, మీరు స్నేహితులుగా ఉన్న Snapchatters యొక్క పేర్లు, మరియు మా సేవలను ఉపయోగిస్తున్న ఇతరులతో మీ కనెక్షన్లను Snapchatters అర్థం చేసుకోవడానికి సహాయపడే ఇతర సమాచారము వంటి, మీరు మా సర్వర్లతో ఎలా సంభాషించారనే దాని గురించిన సమాచారము. ఉదాహరణకు, మీకు వాస్తవంగా తెలిసియున్న మరొకరి నుండి ఒక కొత్త స్నేహితుడి అభ్యర్థన వస్తున్నదా అనేది స్పష్టంగా తెలియకపోవచ్చు కాబట్టి మీకు మరియు కోరిన వ్యక్తికి ఉమ్మడిగా Snapchat స్నేహితులను కలిగియున్నారా అనే సమాచారాన్ని మేము పంచుకోవచ్చు.

    • మీరు పంచుకోమని మాకు నిర్దేశించిన ఏదైనా అదనపు సమాచారము. ఉదాహరణకు, మీరు మీ Snapchat ఖాతాను ఒక తృతీయ-పక్ష యాప్ కు కనెక్ట్ చేసినప్పుడు, మరియు మీరు Snapchat నుంచి సమాచారం లేదా కంటెంట్‌ను తృతీయ-పక్ష యాప్ కు పంచుకున్నప్పుడు, Snap మీ సమాచారాన్ని పంచుకుంటుంది.

    • మీరు పోస్ట్ చేసిన లేదా పంపించిన కంటెంట్. మీ కంటెంట్ ఎంత విస్తృతంగా పంచుకోబడిందనేది మీ వ్యక్తిగత సెట్టింగ్స్ మరియు మీరు ఉపయోగిస్తున్న సర్వీస్ యొక్క రకము‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఎంచుకున్న ఒకే ఒక్క స్నేహితుడికి Snap పంపించబడవచ్చు, అయితే మీ My Story కంటెంట్‌ని మీరు మీ My Story చూడటానికి అనుమతించిన ఏ Snapchatter అయినా చూడవచ్చు.

  • Snapchatters, మా వ్యాపార భాగస్వాములు, సాధారణ ప్రజానీకం అందరితో. మేం ఈ క్రింది సమాచారాన్ని Snapchatters అందరితో అదేవిధంగా మా వ్యాపార భాగస్వాములు మరియు సాధారణ ప్రజానీకము అందరితోనూ పంచుకోవచ్చు:

    • మీ పేరు, యూజర్ నేమ్, ప్రొఫైల్ చిత్రాలు, Snapcode మరియు పబ్లిక్ ప్రొఫైల్ వంటి బహిరంగ సమాచారము.

    • మీ హైలైట్స్, కస్టమ్ Stickers, Lenses, ప్రతిఒక్కరూ వీక్షించడానికి సెట్ చేయబడిన Story సమర్పణలు మరియు స్పాట్‌లైట్, Snap Map మరియు ఇతర క్రౌడ్-సోర్స్డ్ సర్వీసుల వంటి సహజమైన పబ్లిక్ సర్వీసుకు మీరు సమర్పించే ఏదైనా కంటెంట్ వంటి బహిరంగ కంటెంటు. ఈ కంటెంట్‌ను శోధన ఫలితాల ద్వారా, వెబ్‌సైట్‌లపై, యాప్‌లలో మరియు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్రసారాలతో సహా, మా సేవలపైనా మరియు వెలుపల రెండింటిలోనూ ప్రజలందరూ చూడవచ్చు, ఉపయోగించుకోవచ్చు మరియు పంచుకోవచ్చు.

  • మా అనుబంధ సంస్థలతో. మేము Snap Inc.కంపెనీల యొక్క కుటుంబం లోపున ఉన్న ప్రతిపత్తులతో సమాచారాన్ని పంచుకోవచ్చు.

  • తృతీయ పక్షాలతో. ప్రకటనల పనితీరును కొలవడానికి మరియు సానుకూలం చేయడానికి తృతీయపక్ష వెబ్ సైట్ లు మరియు యాప్ లతో సహా, మరియు మరింత సముచితమైన ప్రకటనలను అందించడానికి మా తరఫున సేవలను నిర్వర్తించే సేవా ప్రదాతలతో మీ గురించిన సమాచారాన్ని మేము పంచుకోవచ్చు. ఇక్కడ మరింత తెలుసుకోండి.

    • మా సేవలపై సేవలను మరియు విధినిర్వహణను అందించే వ్యాపార భాగస్వాములతో మేము మీ గురించిన సమాచారాన్ని పంచుకోవచ్చు. మా సర్వీసులపై తృతీయ పక్షాలచే సేకరించబడిన సమాచారం గురించి మరింత సమాచారం కొరకు, మా సపోర్ట్ సైట్సందర్శించండి.

    • మోసాలను నిరోధించడానికి గాను, మాకు మరియు ఇతరులకు సహాయం చేయడానికి, ఉపకరణం మరియు వాడుక సమాచారం వంటి మీ గురించిన సమాచారాన్ని మేము పంచుకోవచ్చు.

    • చట్టపరమైన, సురక్షిత మరియు భద్రతా కారణాల కొరకు మేము మీ గురించిన సమాచారాన్ని పంచుకోవచ్చు. ఈ క్రింది పనులకు సమాచారమును వెల్లడించడం అవసరమని మేము సహేతుకంగా విశ్వసించినట్లయితే, మేము మీ గురించిన సమాచారాన్ని పంచుకోవచ్చు:

      • ఏదైనా చెల్లుబాటు అయ్యే చట్టపరమైన ప్రక్రియ, ప్రభుత్వ అభ్యర్థన లేదా వర్తించే చట్టం, నియమం లేదా నిబంధనతో సమ్మతి వహించుట.

      • సంభావ్య సేవా షరతులు మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయుట, పరిష్కరించుట లేదా అమలు చేయుట.

      • మా యొక్క, మా వినియోగదారుల లేదా ఇతరుల హక్కులు, ఆస్తి లేదా భద్రతను పరిరక్షించుట.

      • ఏదైనా మోసం లేదా భద్రతా సమస్యలను కనిపెట్టుట మరియు పరిష్కరించుట.

    • విలీనం లేదా స్వాధీనతలో భాగంగా మీ గురించిన సమాచారాన్ని మేము పంచుకోవచ్చు. ఒకవేళ Snap Inc. గనక ఒక విలీనం, ఆస్తి అమ్మకం, ఆర్థిక సహాయం చేయడం, లిక్విడేషన్ లేదా దివాలా, మా బిజినెస్ మొత్తం లేదా కొంత భాగాన్ని మరో కంపెనీ స్వాధీనం చేసుకున్నట్లయితే, ఆ లావాదేవీ ముగియడానికి ముందు మరియు ఆ తర్వాత మేము మీ సమాచారాన్ని ఆ కంపెనీతో పంచుకోవచ్చు.

  • వ్యక్తిగత-యేతర సమాచారము.  మాకు సేవలు అందించే లేదా మాకు సమగ్రమైన, వ్యక్తిగతంగా గుర్తించలేని లేదా గుర్తించబడని సమాచారాన్ని లేదా వ్యాపార ఆవశ్యకతలను నిర్వర్తించే తృతీయ పక్షాలతో కూడా మేము పంచుకోవచ్చు.

తృతీయ-పక్ష కంటెంట్ మరియు విలీనములు

మా సేవలు తృతీయ-పక్ష కంటెంట్ మరియు విలీనములను కలిగి ఉండవచ్చు. ఉదాహరణలలో, కెమెరాలో తృతీయ-పక్ష విలీనములు, చాట్‌లో తృతీయ-పక్ష గేమ్‌లు మరియు తృతీయ-పక్ష Snap కిట్ విలీనములు చేరి ఉంటాయి. ఈ విలీనముల ద్వారా, మీరు తృతీయపక్షానికి అదేవిధంగా Snap‌కు సమాచారాన్ని అందిస్తూ ఉండవచ్చు. ఆ తృతీయ పక్షాాలు మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో లేదా ఎలా ఉపయోగిస్తాయో అనేదానికి మేము బాధ్యులు కాదు. ఎప్పటి లాగానే, మా సర్వీసుల ద్వారా మీరు ఇంటరాక్ట్ చేసే ఆ తృతీయ పక్షాలతో సహా మీరు సందర్శించే లేదా ఉపయోగించే ప్రతి తృతీయ - పక్షపు సేవ‌ల గోప్యతా పాలసీలను మీరు సమీక్షించాల్సిందిగా మేము ప్రోత్సహిస్తాము. మీరు Snapchat లోని తృతీయ - పక్షసేవల గురించి మరింతగా ఇక్కడ తెలుసుకోవచ్చు.

మేము మీ సమాచారాన్ని ఎంతకాలం ఉంచుకుంటాము

ఆ క్షణం గడపడానికి ఏది ఇష్టమో దాన్ని మీరు గ్రహించడానికి Snapchat మీకు వీలు కలిగిస్తుంది. మా వైపు నుండి, అంటే Snapchatలో పంపించిన—Snaps మరియు Chats—వంటి అనేక సందేశాలు, స్వీకర్తలందరిచేతనూ తెరవబడ్డాయని లేదా గడువుతీరిపోయాయని మేము కనుగొన్న తర్వాత మా సర్వీసుల నుండి డిఫాల్ట్‌గానే ఆటోమేటిక్‌గా తొలగించబడతాయని అర్థం. Story పోస్టులు వంటి ఇతర కంటెంట్, ఎక్కువ కాలం భద్రపరచబడుతుంది. విభిన్న రకాల కంటెంట్‌ని మేము ఎంత కాలం నిల్వ చేసుకుంటామనే దానిపై సవివరమైన సమాచారం కోసం మా సపోర్ట్ సైట్ చూడండి.

మేం ఇతర సమాచారాన్ని చాలా ఎక్కువ కాలం పాటు నిల్వ చేస్తాము. ఉదాహరణకు:

  • మీ పేరు, ఫోన్ నెంబర్ మరియు ఇమెయిల్ చిరునామా వంటి మీ ప్రాథమిక ఖాతా సమాచారాన్ని—మరియు స్నేహితుల జాబితాను మీరు వాటిని తొలగించమని మమ్మల్ని అడిగే వరకు నిల్వ చేసుకుంటాము.

  • లొకేషన్ సమాచారము ఎంత ప్రశస్తమైనది మరియు మీరు ఏ సర్వీసులు ఉపయోగిస్తున్నారు అనేదానిని బట్టి మేము దానిని వివిధ కాలవ్యవధులపాటు భద్రపరుస్తాము. ఒకవేళ లొకేషన్ సమాచారం Snapతో అసోసియేట్ అయినట్లయితే- మెమోరీస్‌కు సేవ్ చేయబడ్డ లేదా Snap మ్యాప్‌కు పోస్ట్ చేయబడ్డవిధంగా- మనం స్నాప్‌ని స్టోర్ చేసినంత కాలం ఆ లొకేషన్‌ని నిలుపుకుంటాం. ఉపయోగకర చిట్కా: మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడంద్వారా మీ గురించి మేము నిలుపుకున్న లొకేషన్ డేటాను మీరు చూడొచ్చు.

ఒకవేళ మీరు ఎప్పుడైనా Snapchat వాడకం ఆపాలని నిర్ణయించుకుంటే, కేవలం మీ ఖాతాను తొలగించమని మమ్మల్ని అడగండి. మీరు కొంతకాలం నిష్క్రియాత్మకంగా ఉన్న తర్వాత మీ గురించి మేము సేకరించిన సమాచారములో ఎక్కువ భాగాన్ని మేము కూడా తొలగిస్తాము!

మా తొలగింపు ఆచరణలను ఆటోమేటిక్‌గా చేపట్టేలా మా సిస్టమ్‌లు రూపొందించబడి ఉండడం వల్ల, ఒక నిర్దిష్ట సమయపరిధి లోపున తొలగింపు జరుగుతుందని మేం వాగ్దానం చేయలేమని మనసులో ఉంచుకోండి. మీ డేటాను నిల్వ చేయడానికి చట్టపరమైన ఆవశ్యకతలు ఉండవచ్చు మరియు కంటెంట్‌ను సంరక్షించమని కోరుతూ చెల్లుబాటు అయ్యే చట్టపరమైన ప్రక్రియను మేము అందుకున్నట్లయితే, దురుపయోగము లేదా ఇతర సేవా ఉల్లంఘనల నివేదికలు అందుకున్నట్లయితే, లేదా మీచే సృష్టించబడిన మీ ఖాతా లేదా కంటెంట్ దురుపయోగము లేదా ఇతర సేవా ఉల్లంఘనల కొరకు ఇతరులు లేదా మా సిస్టమ్‌ల ద్వారా ఫ్లాగ్ చేయబడినట్లయితే, ఆ తొలగింపు పనులను మేము నిలిపివేయాల్సి ఉంటుంది. అంతిమంగా, మేము కొంత నిర్దిష్ట సమాచారమును పరిమిత కాలవ్యవధి పాటు లేదా చట్టముచే ఆవశ్యకమైనట్లుగా బ్యాకప్‌లో కూడా నిలిపి ఉంచుకోవచ్చు.

మీ సమాచారం మీద నియంత్రణ

మీరు మీ సమాచారమును నియంత్రణలో ఉంచుకోవాలని మేము కోరుకుంటాము, కాబట్టి మేము మీకు ఈ క్రింది సాధనాలను అందిస్తాము.

  • ప్రాప్యత, దిద్దుబాటు, మరియు పోర్టబిలిటీ. మీరు మా యాప్స్ లోనే మీ ప్రాథమిక సమాచారములో అత్యధిక భాగాన్ని ప్రాప్యత చేసుకొని మరియు సవరించవచ్చు. మా యాప్స్ లో తీసుకువెళ్ళదగిన ఫార్మాట్ లో లేని సమాచారము యొక్క కాపీని పొందుటకు మీరు నా డేటా డౌన్‌లోడ్ చేయండి ని కూడా ఉపయోగించుకోవచ్చు, తద్వారా మీరు దానిని తరలించవచ్చు లేదా మీరు కోరిన చోట భద్రపరచుకోవచ్చు. మీ గోప్యత మాకు ముఖ్యం కాబట్టి, మీ వ్యక్తిగత సమాచారమును మీరు ప్రాప్యత చేసుకునేలా లేదా అప్‌డేట్ చేసేలా చేయడానికి ముందు మీ గుర్తింపును సరిచూసుకొమ్మని లేదా అదనపు సమాచారము అందించమని మేము మిమ్మల్ని అడుగుతాము. మేము అనేక కారణాల రీత్యా, ఉదాహరణకు, ఆ అభ్యర్థన ఇతర వాడుకదారుల గోప్యతను ప్రమాదములో పడవేసేదైతే, లేదా న్యాయబద్ధము కానిదైతే, మీ వ్యక్తిగత సమాచారమును ప్రాప్యత చేసుకోవడానికి లేదా అప్‌డేట్ చేయడానికై మీ అభ్యర్థనను కూడా మేము తిరస్కరించవచ్చు.

  • అనుమతులను రద్దుపరచుట. చాలా సందర్భాల్లో, మీరు మీ సమాచారాన్ని ఉపయోగించడానికి మాకు వీలు కల్పించినట్లయితే, మీ ఉపకరణము ఆ ఎంపికలను అందించిన పక్షములో, కేవలం యాప్ లేదా మీ ఉపకరణంలోని సెట్టింగ్ లను మార్చడం ద్వారా మీరు మీ అనుమతిని రద్దుపరచవచ్చు. ఐతే, మీరు అలా చేస్తే, కొన్ని సర్వీసులు తమ పూర్తి ఫంక్షనాలిటీని కోల్పోవచ్చు.

  • తొలగింపు. మీరు జీవితకాల Snapchatter గా ఉంటారని మేము ఆశిస్తుండగా, ఒకవేళ కొన్ని కారణాల వల్ల మీరు ఎప్పుడైనా మీ ఖాతాను తొలగించాలనుకుంటే, ఎలాగో తెలుసుకోవడానికి ఇక్కడికి వెళ్లండి. మీరు మెమోరీస్ కు సేవ్ చేసిన ఫోటోలు, స్పాట్‌లైట్ సమర్పణలు, మరియు శోధన చరిత్ర వంటి యాప్‌లోని కొంత సమాచారాన్ని కూడా తొలగించవచ్చు.

  • అడ్వర్టైజింగ్ ప్రాధాన్యతలు. మీ ఆసక్తులకు సముచితమైనవని మేము భావించే యాడ్స్ ని మీకు చూపించడానికి మేము ప్రయత్నిస్తాము. ఈ ప్రకటనలను ఎంచుకోవడానికి మేము మరియు మా ప్రకటన భాగస్వాములు ఉపయోగించే సమాచారానికి మీరు మార్పుచేర్పులు చేయాలని అనుకుంటే, మీరు యాప్ లో మరియు మీ ఉపకరణం ప్రాధాన్యతల ద్వారా అలా చేయవచ్చు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడికి వెళ్ళండి.

  • ఇతర Snapchattersతో సంభాషించడం. మీరు ఎవరితోనైతే కమ్యూనికేట్ చేస్తున్నారో, వారి మీద నియంత్రణ కలిగి ఉండడం మాకు ముఖ్యం. అందుకనే, ఇతర విషయాల పైకీ, మీ Stories ని ఎవరు చూడాలనుకుంటున్నారో వారిని సూచించడానికి, మీరు కేవలం మీ స్నేహితుల నుండి మాత్రమే Snaps అందుకోవాలనుకుంటున్నారా లేదా Snapchatters అందరి నుండి కూడానా, మరియు మిమ్మల్నిమళ్ళీ సంప్రదించడానికి మరొక Snapchatter ని మీరు బ్లాక్ చేయాలనుకుంటున్నారా అని ఎంచుకోవడానికి మీకు వీలు కల్పించే అనేక సాధనాలను మేము సెట్టింగ్స్ లో నిర్మించాము. మరింత తెలుసుకోవడానికి ఇక్కడికి వెళ్ళండి.

అంతర్జాతీయ డేటా బదిలీలు

యునైటెడ్ స్టేట్స్ మరియు మీరు నివసించే ఇతర దేశాల బయటివైపు నుండి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించవచ్చు, దానిని బదిలీ చేయవచ్చు మరియు నిల్వ చేయవచ్చు మరియు ప్రక్రియ జరుపవచ్చు. మీరు నివసించే ప్రదేశానికి బయటి వైపుకు మేము సమాచారాన్ని పంచుకున్నప్పుడు, మేము చట్టబద్ధంగా అలా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, సముచితమైన బదిలీ పద్ధతి అమలులో ఉండేవిధంగా మేము చూసుకుంటాము. మేము సమాచారాన్ని పంచుకునే ఏవైనా మూడవ పక్షాలు కూడా సముచితమైన బదిలీ పద్ధతిని కలిగి ఉండేట్లుగా మేము చూసుకుంటాము. మేము ఎటువంటి డేటా బదిలీ పద్ధతిని ఇక్కడఉపయోగిస్తామో, మరియు మేము సమాచారాన్ని పంచుకునే తృతీయపక్షాల కేటగరీలపై మరింత సమాచారాన్ని ఇక్కడమీరు కనుగొనవచ్చు.

రాష్ట్ర మరియు ప్రాంత నిర్దిష్ట సమాచారం

మీ రాష్ట్రం లేదా ప్రాంతంలో మీరు నిర్ధిష్ట గోప్యతా హక్కులు కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, యునైటెడ్ స్టేట్స్‌లో, కాలిఫోర్నియా మరియు ఇతర రాష్ట్రాల నివాసితులు నిర్దిష్ట గోప్యతా హక్కులను కలిగి ఉన్నారు. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (EEA), యుకె, బ్రెజిల్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు ఇతర ప్రాంతపరిధులలోని Snapchatters కూడా నిర్దిష్ట హక్కులను కలిగి ఉన్నారు. మేము రాష్ట్ర మరియు ప్రాంత నిర్దిష్ట వెల్లడింపుల యొక్క ఎప్పటికప్పటి అవలోకనాన్ని ఇక్కడఉంచుతాము.

పిల్లలు

మా సేవలు 13 సంవత్సరాలలోపు వారికి ఉద్దేశించబడినవి కాదు—మరియు 13 సంవత్సరాలలోపు వారికి ఎవ్వరికీ మేము వాటిని నిర్దేశించము. మరి అందువల్లనే మేము తెలిసీ 13 సంవత్సరాల లోపు వయసున్న ఎవ్వరి నుండీ వ్యక్తిగత సమాచారమును సేకరించము. దానికి అదనంగా, 13 మరియు 16 సంవత్సరాల మధ్య వయసున్న EEA మరియు UK వాడుకదారుల నుండి కొంత సమాచారమును సేకరించడాన్ని, వాడకాన్ని మరియు భద్రపరచడాన్ని పరిమితి చేయవచ్చు. కొన్ని ఉదంతాలలో, ఈ వాడుకదారులకు మేము కొన్ని ఫంక్షనాలిటీలను అందించలేమని దీని అర్థము. మీ సమాచారాన్ని ప్రక్రియ జరపడానికి ఒక చట్టబద్ధమైన ఆధారంగా సమ్మతి పైన మేము ఆధారపడాల్సి వస్తే, మరియు పేరెంట్ నుండి సమ్మతి మీ దేశానికి అవసరమైతే, ఆ సమాచారమును సేకరించి ఉపయోగించడానికి ముందుగా మాకు మీ పేరెంట్ యొక్క సమ్మతి అవసరం కావచ్చు.

గోప్యతా పాలసీకి సవరణలు

మేము ఈ గోప్యత పాలసీని సమయానుగుణంగా మార్చవచ్చు. అయితే, మేము అలా చేసేటప్పుడు, మేము మీకు ఏదో ఒక విధంగా తెలియజేస్తాము. కొన్నిసార్లు, మా వెబ్‌సైట్ మరియు మొబైల్ అప్లికేషన్ పై ఉండే గోప్యత పాలసీ యొక్క పైభాగములోని తేదీని సవరించడం ద్వారా మేము మీకు తెలియజేస్తాము. ఇతర సమయాలలో, మేము మీకు అదనపు నోటీసు ఇవ్వవచ్చు (మా వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీలకు ఒక స్టేట్‌మెంట్ జోడించడం లేదా మీకు యాప్-లోపలి నోటిఫికేషన్ ఇవ్వడం వంటిది).