Purchase Orders and Payments

నవీకరించబడిన: 8 జనవరి, 2021

మీరు Snap లో కొత్త సరఫరాదారుగా ఉన్నారా?
  • మీరు Snap కు కొత్త సరఫరాదారు అయి ఉంటే, మీరు మాతో వ్యాపారం చేయడానికి గాను, మా కొనుగోలు ఆర్డర్ మరియు చెల్లింపు వ్యవస్థ అయిన ఒరాకిల్ లోపున మీరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ Snap పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సరఫరాదారు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను మొదలుపెట్టగలుగుతుంది. ఇది మీరు సరఫరాదారు రిజిస్టర్ ఇమెయిల్‌ను అందుకొనేందుకు దారి తీస్తుంది. సరఫరాదారు మరియు వినియోగదారు అకౌంట్ సృష్టించడానికి గాను రిజిస్ట్రేషన్ ఇమెయిల్ మిమ్మల్ని Snap సరఫరాదారు రిజిస్ట్రేషన్ పోర్టల్‌కు తీసుకెళ్తుంది.

  • మీరు రిజిస్ట్రేషన్ ఇమెయిల్ అభ్యర్థనను స్వీకరించిన తర్వాత, దయచేసి ఈ దశల వారీ ఆన్‌బోర్డింగ్ గైడ్‌ను చూడండి. ఈ పత్రం మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ గుండా నడిపిస్తుంది. ఒకవేళ మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే, దయచేసి  suppliers@snap.com ని సంప్రదించండి.

Snap తో వ్యాపారం చేయడానికి కొనుగోలు ఉత్తర్వులు అవసరమా?
  • Snap ప్రపంచ వ్యాపార సంస్థలు అన్నింటి కోసం కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించింది. మీరు కొనుగోలు ఆర్డర్ జతపరచని ఏవైనా కొనుగోలు అభ్యర్థనలు కలిగి ఉంటే, ఏవైనా వస్తువులు లేదా సేవలను అందించడానికి ముందు వ్యక్తికి ఒకటి అవసరమా అని నిర్ణయించడానికి గాను దయచేసి మీ Snap పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదా Snap యొక్క కొనుగోలు బృందం (purchasing@snap.com) తో పని చేయండి.

  • PO రూపొందడానికి మునుపటి తేదీని చూపించే ఏదైనా ఇన్వాయిస్, చెల్లింపు ఆలస్యాలకు సంభావ్య కారణంతో, అంతర్గత సమీక్షల కోసం నిలిపి ఉంచుకోబడుతుంది.

నాకు ఎలా చెల్లించబడుతుంది?

ఇన్వాయిస్ లు అన్నింటినీ ప్రాసెసింగ్ కోసం ap.invoices@snapchat.com కు ఇమెయిల్ చేయాలి.

ప్రాసెసింగ్ లో గానీ లేదా చెల్లింపులో గానీ ఎటువంటి ఆలస్యం లేకుండా చూసుకోవడానికి గాను ఇన్వాయిస్ సమర్పించడానికి ముందు కనీస ఇన్వాయిస్ అవసరాలు నెరవేర్చాలని మేము అడుగుతాము.

  • ఇన్వాయిస్ కనీస ఆవశ్యకతలు:

    • ఇన్వాయిస్ PDF ఫార్మాట్ లో ఉండేలా నిర్ధారించుకోండి (జతచేసిన ఒక్కొక్కదానికి 1 ఇన్వాయిస్)

    • మీ కంపెనీ పేరు

    • ఇన్వాయిస్ నంబరు

    • ఇన్వాయిస్ తేదీ

    • Snap చే జారీ చేయబడిన PO నంబరు (PR నంబరు కాదు)

    • Snap జారీ చేసిన PO లో పేర్కొన్నట్లుగా Snap చట్టపరమైన అస్థిత్వం మరియు బిల్లింగ్ చిరునామా

    • మొత్తం బకాయీ మొత్తము మరియు చెల్లింపు కరెన్సీ

    • ఒకవేళ షిప్పింగ్ వసూలు చేస్తే, దయచేసి విడిగా ఆ విషయాన్ని స్పష్టంగా లేబుల్ చేయండి

    • చెల్లింపు సూచనలు (ఐచ్ఛికం)

మీరు సేవలను అందిస్తున్నట్లయితే, ఇన్వాయిస్ లో తప్పనిసరిగా ఇవి ఉండాలి (1) గంటకు రేట్లు, (2) సేవా తేదీలు లేదా తేదీ పరిధి మరియు (3) నిర్వహణ సేవల విషయంలో, వర్తించే సేవ ఆర్డర్‌ల సంతకం చేయబడిన కాపీలు.

నా ఇన్వాయిస్ ఎప్పుడు చెల్లించబడుతుంది?
  • పక్షాల మధ్య వ్రాసుకోబడి ఉన్న ఒప్పందంలో అంగీకరించి ఉంటే తప్ప, Snap యొక్క ప్రామాణిక చెల్లింపు నిబంధనలు మా ప్రక్రియ తర్వాత ఖచ్చితమైన ఇన్వాయిస్ ని Snap అందుకోవడాన్ని ఆధారంగా ఇన్వాయిస్ తేదీ నుండి నికరంగా 60 రోజులుగా ఉంటాయి.

  • మీ ఒరాకిల్ సరఫరాదారు పోర్టల్ యాక్సెస్‌ను ఉపయోగించి మీ ఇన్వాయిస్ చెల్లింపు మరియు స్థితిని తనిఖీ చేసుకోండి. ఈ క్రింది లింక్ మిమ్మల్ని సరఫరాదారు పోర్టల్దిశగా మీకు మార్గనిర్దేశం చేస్తుంది.

ఒరాకిల్ సరఫరాదారు పోర్టల్‌లో ఇంకా లేరా?
  • తాము సంబంధిత సరఫరాదారు ఆన్‌బోర్డింగ్ పేపర్‌వర్క్ పూర్తి చేసినట్లుగా నిర్ధారించడానికి మీ Snap సంప్రదింపు పాయింట్ ని ఇమెయిల్ చేయండి.

  • ఒకవేళ మీ Snap సంప్రదింపు పాయింట్ ఇదివరకే సరఫరాదారు ఆన్‌బోర్డింగ్ పేపర్‌వర్క్ పూర్తి చేసి ఉంటే, మరియు మీరు ఒరాకిల్ నుండి ఇంకా ఇమెయిల్ అందుకోవాల్సి ఉంటే, ఫాలో-అప్ చేయడానికై దయచేసి మమ్మల్ని suppliers@snap.com పై సంప్రదించండి.

Have additional Accounts Payable or invoice related questions?

Please contact the relevant Accounts Payable team via:

Country

Area of support

AP Email Address

Global

Invoice & Payment Concerns

ap@snapchat.com

Global

Invoice Submission Only

ap.invoices@snapchat.com

Global

PO Questions and Concerns

purchasing@snapchat.com

Global

Supplier Registration & Profile Management

suppliers@snapchat.com