బహుమతి కార్డు నిబంధనలు

అమల్లోనికి వచ్చేది: 20 నవంబర్, 2023

ఆర్బిట్రేషన్ నోటీసు: మీరు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నా లేదా మీ ప్రధాన వ్యాపారం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నట్లయితే, మీరు SNAP INC. ఆర్బిట్రేషన్నిబంధనలకు కట్టుబడి ఉంటారు. సేవా నిబంధనలు: ఆ ఆర్బిట్రేషన్ నిబంధనలలో పేర్కొనబడ్డ కొన్ని రకాల వివాదాలు మినహా, మీరు మరియు Snap Inc. మా మధ్య వివాదాలు SNAP INCలో పేర్కొన్న విధంగా తప్పనిసరి బైండింగ్ ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించబడతాయని అంగీకరిస్తున్నారు. సేవా నిబంధనలు మరియు మీరు మరియు SNAP INC. ఒక క్లాస్-యాక్షన్ లాసూట్ లేదా క్లాస్-వైడ్ ఆర్బిట్రేషన్ లో పాల్గొనడానికి ఉన్న ఏదైనా హక్కు మాఫీ చేయబడుతుంది.

పరిచయం

ఈ బహుమతి కార్డ్ నిబంధనలు జాగ్రత్తగా చదవండి. ఈ బహుమతి కార్డ్ నిబంధనలు, మీకు మరియు Snap మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి మరియు సేవలపై ("బహుమతి కార్డ్") Snapchat+ బహుమతి కార్డుల కొనుగోలు మరియు రిడెంప్షన్‌లను నియంత్రిస్తాయి. ఈ బహుమతి కార్డ్ నిబంధనలు Snap సేవా నిబంధనల రిఫరెన్స్ ద్వారా చేర్చబడినాయి. ఇతర నిబంధనలు వేటితోనైనా ఈ బహుమతి కార్డ్ నిబంధనలు విభేదించే మేరకు, ఈ బహుమతి కార్డ్ నిబంధనలు, ఒక బహుమతి కార్డ్ ఉపయోగించి Snapchat+ సబ్‌స్క్రిప్షన్స్ యొక్క బహుమతి ఇవ్వడానికి సంబంధించి నియంత్రిస్తాయి. బహుమతి కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేయడం, బహుమతి ఇవ్వడం మరియు Snapchat+ సబ్‌స్క్రిప్షన్స్ రిడీమ్ చేసుకొనే సామర్థ్యం, ​​Snap సేవా నిబంధనలలో నిర్వచించిన విధంగా Snap యొక్క "సేవల"లో భాగం.

1. ఒక బహుమతి కార్డ్ కొనుగోలు చేయడం

a. మీరు తృతీయ పక్ష సేవాదారునుండి ఒక బహుమతి కార్డ్ కొనుగోలు చేసినట్లయితే, ఆ తృతీయ పక్ష సేవాదారుతో మీ సంబంధాలకు అదనపు నిబంధనలు వర్తిస్తాయి మరియు ఆ బహుమతి కార్డ్ కొనుగోలును కూడా నియంత్రిస్తాయి.

2. రిడెంప్షన్

a. బహుమతి కార్డులు ఇమెయిల్ ద్వారా డిజిటల్‌గా డెలివరీ చేయబడతాయి మరియు www.snapchat.com/plus మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు. ఒక బహుమతి కార్డును రిడీమ్ చేసుకోవడానికి మరియు బహుమతి కార్డ్‌పై సూచించబడిన వ్యవధికి ఒక బహుమతి ఇవ్వబడిన Snapchat+ సబ్‌స్క్రిప్షన్ ఆక్టివేట్ చేసుకోవడానికి, మీరు: (i) ఒక Snapchat అకౌంట్ కలిగివుండాలి లేదా రిజిస్టర్ చేసుకోవాలి; (ii) ప్రస్తుత మరియు క్రియాశీల Snapchat+ సబ్‌స్క్రిప్షన్ కలిగివుండరాదు; (ii) కనీస వయస్సు 13 సంవత్సరాలు (లేదా Snapchat+ మరియు Snapchatలను ఒకవ్యక్తి తల్లిదండ్రుల సమ్మతి లేకుండా ఉపయోగించడానికి మీ రాష్ట్రం, ప్రాదేశిక ప్రాంతం లేదా దేశంలోని కనీస వయస్సు, ఒకవేళ ఎక్కువగా ఉంటే); మరియు (iv)కొనుగోలు చేసిన దేశంలోనే బహుమతి కార్డును రిడీమ్ చేసుకోవచ్చు.

3. పరిమితులు

ప్రతి బహుమతి కార్డ్ కేవలం ఒక వాడకానికి మాత్రమే ఉంటుంది మరియు ఏవిధమైన అదనపు రిడెంప్షన్ అనుమతిలేకుండా ఒక వ్యక్తిగత అకౌంటుకు ఇవ్వబడిన దాని పూర్తి వ్యవధికి మాత్రమే రిడీమ్ చేయబడుతుంది. బహుమతి కార్డులు, నగదు లేదా క్రెడిట్ కొరకు రిడీమ్ చేయబడవు మరియు మీ రాష్ట్రం లేదా దేశంలో వర్తించే చట్టాలద్వారా అవసరమైనమేరకు మినహా ఒక రిఫండ్ కొరకు తిరిగి ఇవ్వబడలేవు. బహుమతి కార్డులను, Snapchat+ భాగస్వామ్యమయ్యే ఏ ఇతర కంపెనీల ఉత్పత్తులు లేదా సేవల ఆఫర్లను ఆక్టివేట్ చేయడానికి ఉపయోగించబడరాదు. బహుమతి కార్డులకు గడువు ముగింపు ఉండదు, మరియు క్రియారహితంగా ఉన్నట్లయితే దానికి మేము ఎటువంటి ఫీజు లేదా సేవా రుసుములు వసూలు చేయము.

4. డిస్‌క్లెయిమర్

మీరు Snap.com నుండి బహుమతి కార్డ్ కొనుగోలు చేస్తున్నట్లయితే మరియు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నట్లయితే, Snap LLCచే బహుమతి కార్డ్ జారీ చేయబడినప్పటికీ, Snapchat+ మరియు Snapchat సేవ మీకు Snap Inc. చే మాత్రమే అందించబడుతుంది. ఈ కార్డ్ పోయినా, దొంగిలించబడినా, లేదా మోసపూరితంగా పొందినా లేదా అనుమతి లేకుండా ఉపయోగించినవాటి ఫలితంగా సంభవించే నష్టం లేదా దెబ్బతినడానికి, Snap లేదా దాని అనుబంధీకులు లేదా ప్రతినిధులు (Snap LLCతో సహా) బాధ్యత వహించవు.