Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు

అమల్లోనికి వచ్చేది: 26 ఫిబ్రవరి, 2024

ఆర్బిట్రేషన్ నోటీసు: మీరు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నా లేదా మీ ప్రధాన వ్యాపారం యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నట్లయితే, మీరు SNAP INC. ఆర్బిట్రేషన్నిబంధనలకు కట్టుబడి ఉంటారు. సేవా నిబంధనలు: మీ కార్డుదారు ఒప్పందముచే శాసించబడే వివాదాలు మరియు ఆ ఆర్బిట్రేషన్ నిబంధనలో కనబరచిన కొన్ని రకాల వివాదాల కొరకు తప్ప, మీరు మరియు SNAP INC. మా మధ్య వివాదాలు SNAP INCలో పేర్కొన్న విధంగా తప్పనిసరి బైండింగ్ ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించబడతాయని అంగీకరిస్తున్నారు. సేవా నిబంధనలు మరియు మీరు మరియు SNAP INC. ఒక క్లాస్-యాక్షన్ న్యాయ దావాలో లేదా క్లాస్-వ్యాప్త ఆర్బిట్రేషన్ లో పాల్గొనడానికి ఉన్న ఏదైనా హక్కు మాఫీ చేయబడుతుంది. SNAP LLC తో సహా, SNAP INC. యొక్క ఎవరైనా అనుబంధీకులచే అందించబడే సేవలతో మీకు ఉండగల ఏదైనా వివాదమును SNAP INC తో పరిష్కరించుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారు. 

మేము చాలా క్లాజుల చివరలో సారాంశ విభాగాలను అందించాము. ఈ సారాంశాలు మీ సౌలభ్యం కోసం మాత్రమే చేర్చబడ్డాయి మరియు మీ చట్టపరమైన హక్కులు మరియు కర్తవ్య బాధ్యతలను అర్థం చేసుకోవడానికి మీరు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలను పూర్తిగా చదువుకోవాలి.

1. పరిచయం

a. దయచేసి ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు (“Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు”) ను జాగ్రత్తగా చదువుకోండి. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు ఈ దిగువ జాబితా చేయబడిన మీ మరియు Snap అస్థిత్వం మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒక ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి, మరియు Snapchat+, Snap స్ట్రీక్ రిస్టోర్ మరియు టోకెన్‌లు ("చెల్లింపు ఫీచర్లు") వంటి సేవలపై ఏదైనా చెల్లింపు డిజిటల్ కంటెంట్ లేదా డిజిటల్ సేవల కొనుగోలు మరియు వాడకములను శాసిస్తాయి. మీకు చెల్లింపు ఫీచర్లను అందించే Snap అస్థిత్వం ఈ క్రింది విధంగా మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానికి అనుగుణంగా ఉంటుంది:

  • ఒకవేళ మీరు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నట్లయితే, Snap Incచే చెల్లింపు ఫీచర్లు అందించబడతాయి.

  • ఒకవేళ మీరు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, ఈ చెల్లింపు ఫీచర్ల నిబంధనల యొక్క ఆవశ్యకతల కోసం ఆఫ్ఘనిస్థాన్, భారతదేశం, కిర్గిస్తాన్, కజకిస్థాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్థాన్ మరియు ఉజ్బెకిస్థాన్ చేరి ఉంటాయి, అయితే అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, రష్యన్ ఫెడరేషన్ మరియు టర్కీ చేర్చబడి ఉండవు, అప్పుడు, చెల్లింపు ఫీచర్లు Snap గ్రూప్ లిమిటెడ్ సింగపూర్ శాఖ ద్వారా అందించబడతాయి.

  • ఒకవేళ మీరు యునైటెడ్ స్టేట్స్ వెలుపల లేదా ఆసియా-పసిఫిక్ ప్రాంతం వెలుపల ఏదైనా దేశంలో నివసిస్తున్నట్లయితే, చెల్లింపు ఫీచర్లు Snap గ్రూప్ లిమిటెడ్ చే అందించబడతాయి.

b. మీ బిల్లింగ్ ప్రకటన, పైన ఏర్పరచబడిన Snap అస్థిత్వం యొక్క అనుబంధ సంస్థచే ఒక చెల్లింపు ఫీచర్ యొక్క మీ కొనుగోలును, మరియు దానికి చెల్లింపును ప్రాసెస్ చేయవచ్చు మరియు అందుబాటు చేయవచ్చు. అయినప్పటికీ, సేవలు (చెల్లింపు ఫీచర్లతో సహా) మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానికి అనుగుణంగా Snap అస్థిత్వం ద్వారా ఇంకా అందించబడతాయి మరియు నెరవేర్చబడతాయి. బదులుగా మీరు పైన గుర్తించబడిన ఆ Snap అస్థిత్వం సేవలు, చెల్లింపు ఫీచర్లు లేదా ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు సంబంధించిన ఏవైనా సంబంధిత ప్రశ్నలు లేదా సమస్యలను పరిష్కరించుకోవాలి.

c. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు Snap సేవా నిబంధనలుకమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు ఏవైనా వర్తించే ఇతర నిబంధనలు, మార్గదర్శకాలు మరియు విధానాలను సూచికగా కలిగి ఉంటాయి. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు ఇతర నిబంధనలలో దేనితోనైనా విభేదించే విస్తృతి మేరకు, ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలే శాసిస్తాయి. చెల్లింపు ఫీచర్లు, Snap సేవా నిబంధనలులో నిర్వచించబడిన విధంగా Snap యొక్క "సేవలు" యొక్క భాగంగా ఉన్నాయి.

d. ఒక చెల్లింపు ఫీచర్ కొనుగోలు చేయడానికి గాను మీరు కనీసం 18 సంవత్సరాల వయస్సు (లేదా మీ అధికార పరిధిలో చట్టపరమైన మెజారిటీ యొక్క వయస్సు, ఒకవేళ భిన్నంగా ఉంటే) కలిగి ఉన్నారని లేదా మీ పేరెంట్ లేదా చట్టపరమైన సంరక్షకుల యొక్క స్పష్టమైన అనుమతి కలిగి ఉన్నారని మీరు నిర్ధారించాలి. ఒక కొనుగోలు చేయడానికి చెల్లుబాటు అయ్యే ఒక డెబిట్ /క్రెడిట్ కార్డు అవసరం అవుతుంది. కొన్ని చెల్లింపు ఫీచర్లను మా విచక్షణ మేరకు టోకెన్‌లతో స్వాధీనపరచుకోవచ్చు. b. చెల్లింపు ఫీచర్లు ఎటువంటి ద్రవ్యరూప విలువను కలిగి ఉండవు మరియు ఏ రకమైన ఆస్తిగా రూపొందబడవు.

e. సెక్షన్ 15 లోని నిబంధనలతో సహా మీరు నివసిస్తున్న దేశానికి నిర్దిష్టమైన అదనపు నిబంధనలు వర్తించవచ్చు. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో ఉన్న ఏదైననూ మీరు ఉన్నటువంటి దేశంలో తప్పనిసరి వినియోగదారు చట్టం క్రింద మీకు అందించబడిన మీ చట్టపరమైన హక్కులు మరియు నివారణలను ప్రభావితం చేయదు.

సంక్షిప్తంగా: మీరు చెల్లింపు ఫీచర్లను కొనుగోలు చేయడానికి, మీ వయస్సు 18+ (లేదా మీరు ఉండే అధికారపరిధిలోని చట్టపరమైన మెజారిటీ వయస్సు) ఉండాలి లేదా మీ కొనుగోలును అనుమతించేందుకు మీ తల్లిదండ్రులు/చట్టపరమైన సంరక్షకుల అనుమతి ఉండాలి. మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి అదనపు నిబంధనలు వర్తించవచ్చు.

2. మీ కొనుగోలు మరియు చెల్లింపు

a. ఒక చెల్లింపు ఫీచర్ కొనుగోలు చేయడానికి గాను మీరు నమోదిత వినియోగదారు అయి ఉండాలి మరియు Snapchat కు లాగిన్ అవ్వాలి మరియు మీరు విధిగా ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలను అంగీకరించాలి. చెల్లింపు ఫీచర్ల యొక్క అన్ని కొనుగోళ్లకు మరియు ఒక తృతీయ పక్షం ద్వారా మీ చెల్లింపు పద్ధతికి బిల్లు చేయబడే ఏవైనా అనధీకృత మొత్తాల చెల్లింపులతో సహా మీ Snapchat అకౌంట్ క్రింద జరిగే ఏవైనా చెల్లింపు ఫీచర్ల వాడకానికి మీరు బాధ్యతను స్వీకరిస్తారు.

b. మేము మా నుండి లేదా ఒక యాప్-స్టోర్ ప్రొవైడర్ లేదా మరొక తృతీయ పక్షపు కొనుగోలు వేదిక ("కొనుగోలు ప్రొవైడర్") ద్వారా నేరుగా కొనుగోలు కోసం చెల్లింపు ఫీచర్లను అందుబాటు చేయవచ్చు. చెల్లింపు ఫీచర్ యొక్క ధర అమ్మే చోటు వద్ద మీకు ప్రదర్శించబడుతుంది మరియు మీ ఆర్డర్ సబ్మిట్ చేయడానికి క్లిక్ చేసే ముందుగా మీరు ఎల్లప్పుడూ అంతిమ కొనుగోలు ధరను చూస్తారు. ఒకవేళ మీరు చెల్లింపు ఫీచర్లను కొనుగోలు చేయడానికి ఒక కొనుగోలు ప్రొవైడర్ ను ఉపయోగిస్తే, మీ చెల్లింపు వివరాలను నమోదు చేయడానికి మరియు మీ కొనుగోలును పూర్తి చేయడానికి గాను మీరు కొనుగోలు ప్రొవైడర్ యొక్క చెల్లింపు సేవకు మళ్ళించబడతారు. మీ ఆర్డర్ పూర్తి చేయడం లేదా ఒక కొనుగోలు ప్రొవైడర్ ద్వారా చెల్లింపు చేయడంతో ఒకవేళ మీకు ఏవైనా సమస్యలు ఉంటే, దయచేసి మీ కొనుగోలు ప్రొవైడర్ ను నేరుగా సంప్రదించండి.

c. మీరు ఒక చెల్లింపు ఫీచర్ కొనుగోలు చేయడానికి మీ ఆర్డర్ ను సబ్మిట్ చేయునప్పుడు, మేము లేదా సంబంధిత కొనుగోలు ప్రొవైడర్ లావాదేవీని నిర్ధారిస్తూ ఒక ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్ అందజేస్తాము, ఆ సమయంలో, ఈ చెల్లింపు ఫీచర్ల నిబంధనలు మీ మరియు Snap మధ్య అమలు లోనికి వస్తాయి. చెల్లింపును పూర్తిగా అందుకునే వరకూ చెల్లింపు ఫీచర్లు మీకు అందుబాటు చేయబడవు, మరియు పూర్తి చెల్లింపు ధర కోసం చెల్లింపు చేయడంలో వైఫల్యం వలన ఒక చెల్లింపు ఫీచర్ కు మీ ప్రాప్యత రద్దు చేయబడే లేదా సస్పెన్షన్ చేయబడే ఫలితాన్ని ఇస్తుంది. ఏ సమయంలో నైనా మరియు ఏ కారణం చేతనైనా ఆర్డర్లను తిరస్కరించడానికి లేదా రద్దు చేయడానికి Snap హక్కును కలిగి ఉంది. ఒకవేళ మేము మీ కొనుగోలును రద్దు చేసినట్లయితే, మీ ఏకైక మరియు ప్రత్యేక నివారణ అనేది మేము లేదా సంబంధిత కొనుగోలు ప్రొవైడర్: (i) ఆ చెల్లింపు ఫీచర్ కొనుగోలు కోసం ఉపయోగించిన చెల్లింపు పద్ధతికి ఒక క్రెడిట్ జారీ చేయడానికి; లేదా (ii) కొనుగోలు కోసం మీ నుండి రుసుము వసూలు చేయకుండా ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు.

d. ఒక ఆర్డర్ సమర్పించడం ద్వారా, మీరు Snap లేదా సంబంధిత కొనుగోలు ప్రొవైడర్ కు ఇందుకు అధికారం ఇస్తున్నారు: (i) మీరు కొనుగోలు చేసిన చెల్లింపు ఫీచర్ ధర కొరకు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో వివరించిన విధంగా, ఏవైనా టాక్సులు, ఫీజులు మరియు రుసుములకు అదనంగా మీ కార్డు లేదా ఇతర చెల్లింపు పద్ధతికి రుసుము వసూలు చేయడానికి మీరు సబ్మిట్ చేసిన సమాచారమును ఉపయోగించడం; మరియు (ii) మీరు ఒక సబ్స్క్రిప్షన్ కొనుగోలు లేదా యాక్టివేట్ చేసిన చోట చెల్లింపు సబ్స్క్రిప్షన్ యొక్క ఆటంకం కలగకుండా నివారించడానికి గాను, ప్రతిసారీ మీ చెల్లింపు వివరాలను తిరిగి ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఎంచుకున్న చెల్లింపు పద్ధతిని కొనసాగించడం. మీ కొనుగోలును పూర్తి చేయడానికి గాను ఒకవేళ మీరు ఒక కొనుగోలు ప్రొవైడర్ ను ఉపయోగిస్తే, లావాదేవీ ఎప్పుడు చేయబడింది, ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ ఎప్పటికి గడువు లేదా ఆటో నవీకరణకు నిర్ధారించబడింది, చెల్లింపు ఫీచర్ కొనుగోలు చేయడానికి మీరు ఏ కొనుగోలు ప్రొవైడర్ ని ఉపయోగించారు, మరియు ఇతర సంబంధిత సమాచారం వంటి లావాదేవీ గురించిన సమాచారమును Snap అందుకోవచ్చు. 

e. ఒకవేళ ఒక చెల్లింపు ఫీచర్ యొక్క మీ కొనుగోలు టాక్సులకు లోబడి ఉంటే, చెల్లింపు ఫీచర్ యొక్క ఖరీదు, ప్లస్ టాక్సులు (జాతీయ, రాష్ట్ర లేదా స్థానిక అమ్మకాలు, వాడకం, విలువ జోడించబడిన లేదా మీ చెల్లింపు ఫీచర్ కొనుగోలు కు సంబంధించి చెల్లించవలసిన అటువంటి టాక్సులు ఫీజులతో సహా) ఫీజులు మరియు రుసుములు విధించబడినప్పుడు అమలులో ఉన్న ధరలతో టాక్సుల కొరకు ఎటువంటి నిలుపుకోవడం లేదా తగ్గించుకోవడం లేకుండా ఫీజులు మరియు రుసుములు చెల్లించడానికి మీరు అంగీకరిస్తున్నారు. మీరు చెల్లింపు ఫీచర్ ఎలా కొనుగోలు చేశారనే దాని మీద ఆధారపడి, మీ కొనుగోలు ప్రొవైడర్ ఆ పన్నులను సముచితమైన పన్ను విధింపు అధికారానికి పంపించవచ్చు.

f. మీ చెల్లింపు కార్డు జారీదారు ఒప్పందం మీకు కేటాయించబడిన మీ కార్డు యొక్క మీ వాడకాన్ని శాసిస్తుంది మరియు మీకు మరియు వారికి మధ్య ఉన్న హక్కులు మరియు బాధ్యతలను నిర్ణయించుకోవడానికి మీరు ఆ పక్షంతో మీ ఒప్పందాన్ని పరిష్కరించుకోవాలి, మరియు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలతో కాదు. ఒకవేళ మీరు ఒక కొనుగోలు ప్రొవైడర్ ద్వారా ఒక చెల్లింపు ఫీచర్ కొనుగోలు చేసినట్లయితే, అప్పుడు వారి నిబంధనలు మరియు విధానాలు కూడా ఆ చెల్లింపు ఫీచర్ యొక్క మీ కొనుగోలును శాసిస్తాయి. కొనుగోలు ప్రొవైడర్ యొక్క నిబంధనలు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో ఏర్పాటు చేసిన ఏవైనా నిబంధనలతో అస్థిరంగా ఉండిన చోట, ఏవైనా చెల్లింపు-సంబంధిత నిబంధనలకు సంబంధించి కొనుగోలు ప్రొవైడర్ నిబంధనలు మాత్రమే సంపూర్ణంగా శాసిస్తాయి.

సారాంశంలో: ఒక చెల్లింపు ఫీచర్ కొనుగోలు చేయడానికి గాను, మీకు Snapchat అకౌంట్ అవసరం. మీ అకౌంట్ మరియు దాని ద్వారా చేసే ఏదైనా కార్యాచరణలకు మీరే పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఒకవేళ మీరు తృతీయ పక్షం వేదిక (ఒక యాప్ App Store వంటిది) ఉపయోగించి సబ్స్క్రిప్షన్ కోసం చెల్లించినట్లయితే, ఈ చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు అదనంగా మీ చెల్లింపులకు వారి నిబంధనలు వర్తిస్తాయి, మరియు ఏవైనా చెల్లింపు సమస్యల విషయంలో మీరు వారిని సంప్రదించాల్సిన అవసరం ఉండవచ్చు.

3. Snapchat + మరియు ఇతర చెల్లింపు సబ్స్క్రిప్షన్స్

a. ఈ విభాగం ఒక సబ్స్క్రిప్షన్ సేవ ("చెల్లింపు సబ్స్క్రిప్షన్ ") గా మీకు అందజేయబడిన ఏదైనా చెల్లింపు ఫీచర్ యొక్క మీ కొనుగోలు మరియు వాడకమునకు వర్తిస్తుంది. మా సేవలపై మీ అనుభవాన్ని మరింత పెంపొందించడానికి గాను చెల్లింపు సబ్స్క్రిప్షన్స్ కొన్ని ఫీచర్లు, కార్యాచరణ లేదా ఇతర ప్రయోజనాలకు ప్రాప్యతను అందించవచ్చు (ఉదాహరణకు, Snapchat+). 

b. ఇతరత్రా పేర్కొనబడి ఉంటే తప్ప, ఆర్డర్ పేజీ పైన ఏర్పరచియున్న విధంగా ఒక నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లింపు సబ్స్క్రిప్షన్స్ అందుబాటులో ఉండవచ్చు. నెలవారీ సబ్స్క్రిప్షన్స్ కొనుగోలు చేయబడిన తేదీన మొదలవుతాయి మరియు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు అనుగుణంగా రద్దు చేయబడే వరకూ ఒక రోలింగ్ నెలవారీ ప్రాతిపదికన కొనసాగుతాయి. వార్షిక సబ్స్క్రిప్షన్స్ అవి కొనుగోలు చేసిన తేదీన ప్రారంభమవుతాయి మరియు ఒక సంవత్సరం ప్రారంభ స్థిర కాలం పాటు కొనసాగుతాయి, మరియు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు అనుగుణంగా రద్దు చేయబడితే తప్ప ఒక సంవత్సరం అదనపు కాలవ్యవధుల పాటు పునరుద్ధరించబడుతూ ఉంటాయి. ప్రతి నెలవారీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ వ్యవధి కోసం చెల్లింపులు సబ్స్క్రిప్షన్ వ్యవధి ప్రారంభంలో చెల్లించదగినవిగా ఉంటాయి.

c. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు అనుగుణంగా రద్దు చేయబడితే లేదా ఎత్తివేయబడితే తప్ప, కొనుగోలు చేసే సమయంలో మీరు ఎంచుకున్న సబ్స్క్రిప్షన్ ప్రణాళిక యొక్క ప్రారంభ వ్యవధి లాగా అదే కాలవ్యవధి ప్రకారము తదనంతర కాలవ్యవధులకు మీ సబ్స్క్రిప్షన్స్ స్వయంచాలకంగా నవీకరించబడేందుకు మీరు అంగీకరిస్తున్నారు. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు అనుగుణంగా రద్దు చేయబడే లేదా ఎత్తివేయబడే వరకూ, ప్రతి నవీకరణ బిల్లింగ్ కాలవ్యవధి యొక్క ప్రారంభములో మీరు ఎంపిక చేసుకున్న తొలి చెల్లింపు పద్ధతి (ఉదా.క్రెడిట్ కార్డు) ప్రకారం ఆనాటి ప్రస్తుత ధరలతో రుసుము వసూలు చేసుకోవడానికి మీరు మాకు లేదా చెల్లింపు ప్రొవైడర్ కు సుస్పష్టంగా అధికారం ఇస్తున్నారు. నవీకరణపై ధర అప్పటి సబ్స్క్రిప్షన్ యొక్క ప్రస్తుత ధర అయి ఉంటుంది, అది నవీకరణకు ముందు మీకు తెలియజేయబడుతుంది. ఒక నవీకరణ చెల్లింపు కోరబడినప్పుడు మీ అసలు చెల్లింపు పద్ధతి గనక నిరాకరించబడితే, అప్పటి ప్రస్తుత బిల్లింగ్ కాలవ్యవధి ముగింపులో మీ చెల్లింపు సబ్స్క్రిప్షన్ రద్దు చేయబడుతుంది.

d. మీ చెల్లింపు సబ్స్క్రిప్షన్ స్వయంచాలకంగా నవీకరించబడడం మరియు రాబోయే సబ్స్క్రిప్షన్ రుసుములు ఖర్చు కావడం తప్పించుకోవడానికి గాను, మీరు Snapchat లో మీ సబ్స్క్రిప్షన్ సెట్టింగ్‌ల ద్వారా గానీ లేదా చెల్లింపు సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయడానికి ఉపయోగించిన కొనుగోలు ప్రొవైడర్ చే అందించబడిన రద్దు చేయు ప్రక్రియ ద్వారా గానీ మీ సబ్స్క్రిప్షన్ నవీకరించబడే తేదీకి ముందే ఏ సమయములో నైనా మీరు మీ చెల్లింపు సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. 

e. మీరు మీ చెల్లింపు సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకున్నట్లయితే, మీ అప్పటి-ప్రస్తుత బిల్లింగ్ కాలవ్యవధి ముగిసే వరకూ మీరు ఇంకా దాని ఫీచర్లకు ప్రాప్యతను పొందుతూ ఉంటారు. ఒకసారి మీ ప్రస్తుత బిల్లింగ్ కాలవ్యవధి ముగిసిందంటే, మీ చెల్లింపు సబ్స్క్రిప్షన్ యొక్క భాగంగా (అటువంటి ఫీచర్లకు సంబంధించి మీకు అందుబాటు చేయబడిన ఏదైనా కంటెంట్ లేదా సమాచారంతో సహా) మీకు అందుబాటు చేయబడి ఉన్న ఏవైనా ఫీచర్ల యొక్క మీ ప్రాప్యతను మరియు వాడకమును మేము తొలగిస్తాము. ఒకవేళ మీరు యూరోపియన్ యూనియన్, నార్వే లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉంటూ, మరియు మీరు సెక్షన్ 15 క్రింద అనుమతించబడిన 14 రోజుల కూలింగ్-ఆఫ్ కాలవ్యవధిలోనే ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకుంటే, మీ చెల్లింపు సబ్స్క్రిప్షన్ వెంటనే ముగుస్తుంది, మరియు దాని ఏవైనా ఫీచర్లు మరియు ప్రయోజనాలకు మీరు ఇక ఏ మాత్రమూ ప్రాప్యతను పొందలేరు.

f. ఒకవేళ మేము ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ యుక కొనుగోలు ధరను మార్చినట్లయితే, మేము మీకు సహేతుకమైన ముందస్తు నోటీసును అందజేస్తాము. ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ కు ఏదైనా ధర మార్పు అనేది మేము మీకు తెలియజేసిన తేదీ తర్వాత తదుపరి సబ్స్క్రిప్షన్ బిల్లింగ్ వ్యవధి ప్రారంభం నుండి అమలు లోనికి వస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా అట్టి ధర మార్పుతో అంగీకరించకపోతే, ధర మార్పుకు ముందు మీరు మీ చెల్లింపు సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవాలి.

g. Snapchat + ఫీచర్ల మరియు ప్రయోజనాల యొక్క ప్రస్తుత జాబితా మా Snapchat+ మద్దతు పేజీలో, ఏర్పాటు చేయబడి ఉన్నాయి, అయినప్పటికీ అవి ఈ నిబంధనల యొక్క విభాగం 11 ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి.

h. ఒకవేళ మరొక వినియోగదారులు కొనుగోలు చేసిన ఒక కుటుంబ ప్రణాళిక యొక్క సభ్యుడిగా మీరు ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ కు ప్రాప్యతను అందుకుంటే, ప్రాథమిక వినియోగదారులు కుటుంబ ప్లాన్ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకున్నప్పుడు లేదా వేరే విధంగా వారి అకౌంట్ రద్దు అయినప్పుడు చెల్లింపు సబ్స్క్రిప్షన్ కు మీ ప్రాప్యత రద్దు చేయబడుతుంది.

సారాంశంలో: చెల్లింపు సబ్స్క్రిప్షన్లు కాలక్రమేణా మారగల ఫీచర్లు, కార్యాచరణలు మరియు ప్రయోజనాలకు ప్రాప్యతను అందిస్తాయి. మీరు రద్దుచేయవద్దని నిర్ణయిస్తే మినహా, చెల్లింపులు ఆటో-పునరుద్ధరణ చేయబడతాయి. ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయడం ద్వారా, మీ సబ్స్క్రిప్షన్ యొక్క ప్రారంభ కొనుగోలు కోసం మొదట ఉపయోగించబడిన చెల్లింపు పద్ధతిని ఉపయోగించి స్వయంచాలకంగా పునరావృత చెల్లింపులకు మీరు అధీకృతం చేస్తున్నారు.

టోకెన్‌లు

a. ఒకవేళ మీరు Snap టోకెన్ షాప్ ద్వారా Snapchat ("టోకెన్‌లు") పై Snap టోకెన్‌లు స్వాధీనం చేసుకొని ఉపయోగించినట్లయితే, ఈ విభాగం వర్తిస్తుంది. టోకెన్‌లను Snap నుండి మాత్రమే కొనుగోలు చేయవచ్చు లేదా అందుకోవచ్చు మరియు డిజిటల్ వస్తువుల కోసం Snapchat పై రిడీమ్ చేసుకోవచ్చు. టోకెన్‌లు ఎటువంటి ద్రవ్య విలువను కలిగి ఉండవు (అంటే., టోకెన్‌లు నగదు లేదా నగదుకు సమానముగా ఉండవు), ఏ రకమైన కరెన్సీ లేదా ఆస్తిగా ఏర్పడవు, మరియు డబ్బు కొరకు రిడీమ్ చేయబడవు లేదా మార్పిడి చేయబడవు. టోకెన్‌లు ఎలా స్వాధీనం చేసుకోబడినా ఫరవాలేదు, (ఉదా. ఈ దిగువ పేర్కొనబడినట్లుగా ఒక ప్రచార ఆఫర్ యొక్క భాగంగా), అవి ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు లోబడి ఉంటాయి.

b. టోకెన్లు ఎట్టి పరిస్థితులలోను బదిలీ చేయబడవు. మీరు ఇతర Snapchat వినియోగదారులతో సహా (Snapchat లోపల లేదా బయట అయినా ఏదైనా పరిగణన లేదా వస్తువుల విలువగా చూపడంతో సహా) సహా ఏదైనా మూడవ పార్టీ నుండి టోకెన్లు కొనుగోలు, అమ్మకం, బార్టర్, ట్రేడ్ లేదా బదిలీ చేయలేరు, మరియు ఆవిధంగా చేయడానికి చేసే అటువంటి ఏదైనా ప్రయత్నపూర్వక లావాదేవీలు చెల్లుబాటు కావు మరియు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడతాయి. ఈ టోకెన్లపై మీకు ఏవిధమైన ఆస్తిపరమైన, యాజమాన్యపరమైన, మేధో సంపత్తి లేదా ద్రవ్యపరమైన ఆసక్తిని కలిగివుండరు.

c. మీరు టోకెన్లను కొనుగోలు చేసిన లేదా స్వాధీనం చేసుకున్న వెంటనే ఉపయోగించవచ్చు, లేదా తరువాతి తేదీలో ఉపయోగించుకొనే నిమిత్తం మీరు టోకెన్లను Snap టోకెన్స్ వాలెట్‌లో కూడగట్టుకోవచ్చు. మీ Snap టోకెన్‌ల వాలెట్‌లో టోకెన్‌లు చేర్చబడి ఉండటానికి మరియు ఉపయోగించడానికి అందుబాటులో ఉండే ముందుగా మీ చెల్లింపు ప్రాసెస్ చేయబడుతుంది. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనల ప్రకారం ఒకవేళ మేము మీ Snapchat అకౌంట్ లేదా టోకెన్‌లకు మీ ప్రాప్యతను గనక ఎత్తివేస్తే, ఆపుదల లేదా రద్దు చేస్తే, మేము మీ Snap లోని ఏవైనా టోకెన్‌లను కూడా మీకు ఎటువంటి రిఫండ్ లేదా బాధ్యత లేకుండా రద్దు చేయవచ్చు. వర్తించే చట్టం అవసరమైన మేరకు మినహాయించి, మీ Snapchat అకౌంట్ రద్దు చేయబడినప్పుడు, మీరు ఉపయోగించని ఏవైనా టోకెన్లు Snap బదిలీ చేయబడతాయి.

d. ఉపయోగించబడిన లేదా రీడీమ్ చేయబడిన టోకెన్‌లు మీకు తిరిగి ఇవ్వబడజాలవు, ఆ వినియోగము మీచే అధీకృతం చేయబడనప్పటికీ. వర్తించే చట్టం ప్రకారం అవసరమైతే తప్ప, Snap స్టార్స్ మరియు అన్ని ఇతర డిజిటల్ వస్తువులకు ప్రశంసల కామెంట్‌లలో పంపబడిన డిజిటల్ వస్తువులు స్వాధీనం చేసుకున్న, వినియోగించిన లేదా పంపబడిన తర్వాత ఏ కారణం చేతనైనా తిరిగి ఇవ్వదగినవిగా ఉండవు. మీరు కొనుగోలు చేసిన టోకెన్‌లతో లేదా టోకెన్‌ల మార్పిడికి బదులుగా మీరు అందుకున్న ఏవైనా డిజిటల్ వస్తువులతో మీకు ఏవైనా సమస్యలు ఉంటే, ఈ దిగువ సెక్షన్ 14 లో ఏర్పాటు చేయబడిన విధంగా దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

e. Snap తన స్వంత విచక్షణ మేరకు, కొన్ని సంఘటనలు సంభవించినప్పుడు, నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అడగడం ద్వారా లేదా మీరు నిర్దిష్ట ముఖ్యమైన మైలురాళ్ళను చేరుకున్నప్పుడు ఉచిత లేదా ప్రొమోషనల్ టోకెన్‌లను అందించాలని నిర్ణయించుకోవచ్చు.

f. మీరు టోకెన్లను Snapchat పై డిజిటల్ వస్తువులకు మాత్రమే ఉపయోగించి, రిడీమ్ చేసుకోవచ్చు. డిజిటల్ వస్తువులు Snapchat లో మాత్రమే ఫీచర్లకు (ఒక "లైసెన్స్" గా పిలువబడేది) ఒక పరిమిత హక్కును కలిగి ఉంటాయి. టోకెన్‌లచే వీలు కల్పించబడిన ఏవైనా డిజిటల్ వస్తువులుమరియు ఏవైనా ఇతర ఫీచర్ల యొక్క మీవాడకం (Snap స్టార్‌లకు ప్రశంసలు చూపించడానికిి డిజిటల్ బహుమతులతో సహా)ఎల్లప్పుడూ కమ్యూనిటీ మార్గదర్శకాలుతో సమ్మతి వహించాలి. టోకెన్‌లు (మరియు టోకెన్‌లతో రిడీమ్ చేయబడే ఏవైనా డిజిటల్ వస్తువులు) నగదుకు లేదా "నిజమైన ప్రపంచ" వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయడానికి లేదా స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగించబడజాలవు మరియు Snapchat కాకుండా మరేదైనా వేదిక లేదా అప్లికేషన్‌లో ఎటువంటి విలువను కలిగిఉండవు.

g. మేము మరియు Snapchat పై టోకెన్లను అంగీకరించే తృతీయ పక్షాలు, డిజిటల్ వస్తువులకు అవసరమైన టోకెన్ల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, డిజిటల్ వస్తువులను ఉపసంహరించుకోవచ్చు, మరియు అట్టి మార్పులు టోకెన్ల యొక్క వినియోగానికి లేదా కొన్ని డిజిటల్ వస్తువులను పొందడానికి లేదా నిలుపుకోవడానికి గల సామర్థ్యాన్ని ప్రభావితం చేయగలిగినప్పటికీ సైతమూ ఏ సమయంలోనైనా డిజిటల్ వస్తువులను పరిమితం చేయవచ్చు. మీరు ఏవైనా డిజిటల్ వస్తువుల యొక్క నిరంతర లభ్యతపై ఆధారపడకూడదు. మేము మరియు Snapchatపై టోకెన్లను అంగీకరించే తృతీయ పక్షాలు, ఏవిధమైన ముందస్తు నోటీస్ లేకుండా మీరు ఇప్పటికే పొందివున్న ఏవైనా డిజిటల్ వస్తువులను మీకు ఏవిధమైన బాధ్యత వహించకుండా తొలగించడంతో సహా డిజిటల్ వస్తువుల ఇన్వెంటరీని మార్చడానికి లేదా అప్‌డేట్ చేయడానికి హక్కు కలిగి ఉంటాము. డిజిటల్ వస్తువులపై అన్ని హక్కులు, శీర్షిక మరియు ప్రయోజనం మరియు వాటితో ముడిపడి ఉన్న అన్ని కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లు మరియు అందుకు సంబంధించిన మేధో సంపత్తి హక్కులను Snap కలిగి ఉంది.

సారాంశంలో: టోకెన్‌ల మీ కొనుగోలు మరియు వాడకం అనేది అదనపు నిబంధలకు లోబడి ఉంటుంది, కాబట్టి మీ హక్కులు మరియు బాధ్యతలు ఏమిటో చూడడానికి గాను, దయచేసి ఈ విభాగమును జాగ్రత్తగా చదువుకోండి.

5. Snap స్ట్రీక్ రిస్టోర్ మరియు వెంటనే నిర్వహించబడే ఇతర డిజిటల్ సేవలు

a. Snap స్ట్రీక్ రిస్టోర్ అనేది ఒక డిజిటల్ సేవ గడువు తీరి పోయిన Snap స్ట్రీక్ ని పునరుద్ధరించడానికి గాను దానిని కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు మరియు చెల్లింపు అయిన వెంటనే ప్రతి Snap స్ట్రీక్ రిస్టోర్ యొక్క డెలివరీ మరియు పనితీరు పూర్తవుతుంది మరి అందువల్ల అది రద్దు చేయబడజాలదు.

b. కొనుగోలు మరియు చెల్లింపు అయిన వెంటనే పూర్తిగా నిర్వర్తించబడి Snap చే ఎప్పటికప్పుడు కాలానుగుణంగా అందుబాటు చేయబడిన ఏవైనా ఇతర డిజిటల్ సేవలు కూడా రద్దు చేయబడజాలవు.

6. డిజిటల్ కంటెంట్

సేవల ద్వారా కొనుగోలు చేయడానికి మేము డిజిటల్ కంటెంట్‌ను అందుబాటు చేయవచ్చు. మీ కొనుగోలు పూర్తి అయిన మీదట వెంటనే మేము డిజిటల్ కంటెంటును అందించడం ప్రారంభిస్తాము మరి అందువల్లనే ఈ కొనుగోళ్ళు రద్దు చేయబడజాలవు.

7. ప్రొమోషన్లు

a. మేము లేదా మా భాగస్వాములు అప్పుడప్పుడూ ఒక ప్రొమోషనల్ ప్రాతిపదికన (ఉదాహరణకు, రుసుము లేకుండా లేదా ఒక పరిమిత కాలవ్యవధి కోసం రాయితీ ధరతో), మీరు Snap లేదా మా భాగస్వాములచే నిర్ణయించబడినట్లుగా కొన్ని అర్హతా ఆవశ్యకతలను తీర్చినట్లయితే దానికి లోబడి మీకు చెల్లింపు ఫీచర్లకు ప్రాప్యతను ఇవ్వవచ్చు(“ ప్రొమోషనల్ ఆఫర్”). కొన్ని సంఘటనల సంభవించినప్పుడు లేదా కొన్ని చర్యలను తీసుకోవటానికి మిమ్మల్ని అడగడం ద్వారా కూడా మేము మీకు ప్రొమోషనల్ ఆఫర్లను అందుబాటు చేయవచ్చు. మీరు అంగీకరిస్తున్నారు:

  • ప్రొమోషనల్ ఆఫర్‌తో అనుబంధించబడిన ఏవైనా ఇతర పరిమితులు లేదా షరతులు మా స్వంత అభీష్టానుసారం Snap లేదా మా భాగస్వాముల ద్వారా నిర్ణయించబడతాయి మరియు ప్రొమోషనల్ ఆఫర్‌ను యాక్టివేట్ చేయునప్పుడు లేదా రీడీమ్ చేసేటప్పుడు గానీ లేదా ప్రొమోషనల్ ఆఫర్‌ను వివరించే Snap నుండి ఇతర కమ్యూనికేషన్‌లలో మీకు అందుబాటులో ఉంచబడతాయి;

  • ప్రొమోషనల్ ఆఫర్లు ఉద్దేశ్యిత ఆవశ్యకత కొరకు ఉపయోగించబడతాయి మరియు వాటిని చట్టబద్ధమైన పద్ధతిలో ఉపయోగించాలి; 


  • ఏ సమయంలోనైనా ఏదైనా ప్రచార ఆఫర్‌ లభ్యతను షరతు చేసే లేదా రద్దు చేసే హక్కు Snapకి ఉంటుంది; మరియు

  • మీరు ప్రొమోషనల్ ఆఫర్ ని ఎలా అందుకున్నా పరవాలేదు, మీ వాడకము ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు లోబడి ఉంటుంది.

b. ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ కొరకు మీరు ఒక ప్రొమోషనల్ ఆఫర్ ను యాక్టివేట్ చేయునప్పుడు (ఒక తగ్గింపు ధర లేదా ఉచిత ప్రయోగం వంటిది) మీరు రీడీమ్ చేసిన ఏదైనా ప్రొమోషనల్ ఆఫర్ యొక్క గడువు కాలవ్యవధిని అనుసరిస్తూ, ప్రొమోషనల్ ఆఫర్ రిడీమ్ చేసే సమయంలో మీరు తనంతట తానుగా ఎంపిక చేసుకున్న చెల్లింపు సబ్స్క్రిప్షన్ కు తరలించబడతారు మరియు మీరు Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు అనుగుణంగా రద్దు చేస్తే తప్ప, మీకు కేటాయించబడిన చెల్లింపు పద్ధతి పూర్తి చెల్లింపు సబ్స్క్రిప్షన్ కోసం వసూలు చేయబడుతుంది. కాబట్టి, ప్రచార ఆఫర్ గడువు తీరక ముందే ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు అనుగుణంగా ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ కొరకు మీ ప్రచార ఆఫర్ ను రద్దు చేసుకోవడమనే దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి; లేదంటే, ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు అనుగుణంగా మీ చెల్లింపు సబ్స్క్రిప్షన్ ను మీరు రద్దు చేసుకునే వరకూ, ఈ క్రింది బిల్లింగ్ కాల వ్యవధి (ల)కు గాను పూర్తి రుసుములను వసూలు చేసుకోవడానికి మీరు మీ క్రెడిట్ కార్డు లేదా కేటాయించిన ఇతర బిల్లింగ్ పద్ధతిని మీరు మాకు లేదా మీ కొనుగోలు ప్రొవైడరుకు అధీకృతం చేయవలసి ఉంటుంది. 

సారాంశంలో: Snap మీకు చెల్లింపు ఫీచర్లను ఉచితంగా లేదా ఒక డిస్కౌంట్‌తో ప్రాప్యత చేసుకోనివ్వవచ్చు, అయితే మీ ప్రచార ఆఫర్ గనక ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ కోసం అయిఉంటే, ఆఫర్ ముసినప్పుడు మీ నుండి సబ్స్క్రిప్షన్ కోసం స్వయంచాలకంగా వసూలు చేయబడుతుందని జ్ఞాపకం ఉంచుకోండి.

8. మా రద్దు మరియు రీఫండ్ విధానము

a. అన్ని అమ్మకాలు అంతిమమైనవిగా ఉంటాయి మరియు వర్తించే చట్టం ద్వారా అవసరమైనట్లుగా లేదా ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో ఇతరత్రా ఏర్పాటు చేయబడి ఉంటే తప్ప, మేము ఏవైనా రీఫండ్‌లు లేదా క్రెడిట్లను అందించము. ఒకవేళ మీరు యూరోపియన్ యూనియన్, నార్వే లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ఒక వినియోగదారు అయి ఉంటే, ఒక చెల్లింపు ఫీచర్ కొనుగోలు రద్దు చేయడానికి మరియు ప్రారంభ 14 రోజుల కూలింగ్-ఆఫ్ వ్యవధిలో ఒక పాక్షిక లేదా పూర్తి రిఫండ్ అందుకోవడానికి మీకు చట్టపరమైన హక్కు ఉండవచ్చు. ఈ హక్కు ఎలా మరియు ఎప్పుడు వర్తిస్తుందో మరియు వర్తించే ఏవైనా పరిమితులు లేదా మినహాయింపులు ఉన్నాయేమో అనేదాని గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి సెక్షన్ 15 ను చూడండి.

b. ఈ క్రింది పరిస్థితుల్లో చెల్లింపు ఫీచర్లకు మీ ప్రాప్యతను ఏ సమయంలోనైనా మరియు ఏ కారణం చేతనైనా మా స్వంత విచక్షణ మేరకు, మీకు ముందస్తు నోటీసు లేదా బాధ్యత లేకుండా ఎటువంటి పరిమితి లేకపోవడంతో సహా, వెంటనే రద్దుపరచడానికి, నిలిపివేయడానికి లేదా ఎత్తివేయడానికి Snap హక్కును కలిగి ఉంటుంది:

  • మీరు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలను ఉల్లంఘించినప్పుడు, లేదా మీరు సేవల యొక్క చట్టవిరుద్ధమైన లేదా మోసపూరిత వాడకములో నిమగ్నమై ఉన్నారని మేము నమ్మినప్పుడు మేము మీ Snapchat అకౌంట్ రద్దు చేస్తాము (మాకు చట్టంలో లేదా ఈక్విటీలో ఉండగల ఏదైనా నివారణ చర్యకు అదనంగా);

  • ఏదైనా సమర్థ న్యాయస్థానముచే, రెగ్యులేటరీ అథారిటీచే లేదా చట్టమును అమలు చేయు సంస్థచే లేదా మీకు చెల్లింపు ఫీచర్ కొనసాగింపు నిబంధన Snap కొరకు ఏదైనా సంభావ్య ముప్పు లేదా చట్టపరమైన గురిని ఏర్పరచినట్లయితే Snap అలా చేయవలసిన అవసరం ఉంటుంది;

  • అలా చేయడం మా సేవల రక్షణ, సమగ్రత మరియు/లేదా భద్రత కోసం అవసరమై ఉంటుంది; లేదా

  • Snap ద్వారా నిర్ణయించబడిన విధంగా చెల్లింపు ఫీచర్ల యొక్క మా ఏర్పాటు (పూర్తిగా లేదా పాక్షికంగా) ఇక మీకు ఏ మాత్రమూ వీలు కానప్పుడు.

c. వర్తించే చట్టముచే అవసరమైనట్లుగా తప్ప, ఒక చెల్లింపు ఫీచర్ పట్ల మీ ప్రాప్యతకు మా సస్పెన్షన్, ఆపుదల లేదా రద్దు చేయబడిన సందర్భములో, మీ అకౌంట్ తోముడిపడి ఉన్న ఏవైనా ఉపయోగించని చెల్లింపు ఫీచర్లకు లేదా ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ యొక్క ఏదైనా పాక్షికంగా మిగిలిన కాలవ్యవధి కోసం ఎటువంటి రిఫండ్లు ఇవ్వబడవు. 

d. విభాగం 3 ప్రకారం మీరు ఏ సమయంలోనైనా ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవచ్చు.

e. ఒక ధర పడిపోయిన సందర్భములో, డిస్కౌంట్ లేదా మాచే ఇతర ప్రొమోషనల్ సమర్పణను అందుబాటులో ఉంచిన సందర్భంలో, మీరు ఇప్పటికే కొనుగోలు చేసిన ఏదైనా చెల్లింపు ఫీచర్ యొక్క ఖర్చు తగ్గిపోయే విధంగా Snap ధర సంరక్షణను లేదా రీఫండ్‌లను అందించదు.

సారాంశములో: అన్ని అమ్మకాలు అంతిమమైనవిగా ఉంటాయి మరియు వర్తించే చట్టం ద్వారా అవసరమైనట్లుగా లేదా ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో ఇతరత్రా ఏర్పాటు చేయబడి ఉంటే తప్ప మేము రీఫండ్‌లు లేదా క్రెడిట్లను అందించము (విభాగం 15 తో సహా). మీరు ఏదైనా తప్పుగా చేసి ఉన్నప్పుడు లేదా పరిస్థితులు గనక గణనీయంగా మారినట్లయితే మీ ప్రాప్యతను ఎత్తివేయడానికి లేదా రద్దు చేయడానికి కూడా మాకు హక్కులు ఉన్నాయి.

9. మా నుండి సంచారాలు

a. మీరు కొనుగోలు చేసిన ఏవైనా చెల్లింపు ఫీచర్ల గురించి మరియు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు, కొత్త ఫీచర్ల గురించి మరియు ఇతర మార్పులతో సహా, అకౌంట్ కోసం సైన్ అప్ చేయడానికి ఉపయోగించబడే ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్ పైన లేదా ఇన్-యాప్ నోటిఫికేషన్లు, Team Snapchat లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా మేము మీకు ఎలక్ట్రానిక్ నోటిఫికేషన్లను పంపించవచ్చు. ఒక చెల్లింపు ఫీచరును కొనుగోలు చేయడం ద్వారా, లేదా ఒక చెల్లింపు ఫీచరును ఉపయోగించడం ద్వారా, మీరు Snap మరియు మా అనుబంధీకుల నుండి ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో వివరించబడిన ఎలక్ట్రానిక్ సంచారాలను అందుకోవడానికి సమ్మతి ఇస్తున్నారు.

బి. మేము మీకు అందించే అన్ని ఒప్పందాలు, నోటీసులు, బహిర్గతం మరియు ఇతర కమ్యూనికేషన్‌లు వ్రాతపూర్వకంగా ఉండాలనే ఏదైనా చట్టపరమైన అవసరాన్ని ఎలక్ట్రానిక్‌గా సంతృప్తిపరుస్తాయని మీరు అంగీకరిస్తున్నారు.

సారాంశంలో: మీ చెల్లింపు ఫీచర్లు మరియు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనల గురించి సందేశాల కోసం చూడండి.

10. కొనుగోలు మరియు వాడుక పరిమితులు

Snap సేవా నిబంధనలలో ఏర్పరచిన పరిమితులకు అదనంగా, మీరు వీటికి అంగీకరిస్తున్నారు: (a) చెల్లింపు ఫీచర్లు ఎట్టి పరిస్థితులలోనూ ఏదైనా ఇతర అకౌంట్ కు గానీ లేదా సేవల యొక్క వినియోగదారుకు గానీ బదిలీ చేయబడవు, మీరు చెల్లింపు ఫీచర్ కొనుగోలు చేసినప్పుడు మీరు ఉపయోగిస్తున్న అకౌంట్ కు మాత్రమే మీ కొనుగోలు వర్తించబడుతుంది అని అర్థం; (b) మీరు ఏవైనా చెల్లింపు ఫీచర్లను ప్రాప్యత చేసుకోవడానికై మీ అకౌంట్ ఉపయోగించుకోవడానికి ఇతరులను అనుమతించలేరు; (c) ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు మరియు Snap సేవా నిబంధనలుక్రింద అనుమతించబడినట్లుగా కాకుండా మరేదైనా ఉద్దేశ్యం కోసం మీరు చెల్లింపు ఫీచర్లను కొనుగోలు మరియు ఉపయోగించడం చేయలేదు మరియు చెయ్యబోరు; (d) చెల్లింపు ఫీచర్ల కొనుగోలు మరియు వాడకం అనుమతించబడని నిర్బంధిత దేశాలలో మీరు లేరు; (e) అలా చేయడానికి మీకు అవసరమైనట్టి చట్టబద్ధ అధీకరణ ఉంటే తప్ప, ఒక చెల్లింపు ఫీచరును కొనుగోలు చేయడానికి మీరు ఏదైనా చెల్లింపు కార్డు లేదా ఇతర చెల్లింపు రూపమును ఉపయోగించరు; (f) మీరు గానీ, లేదా మీరు ఒక వ్యాపారమైతే, ఏదైనా అనుబంధిత సంస్థ గానీ యుఎస్ ప్రభుత్వముచే నిర్వహించబడుతున్న నిర్బంధిత పక్షాల జాబితాలు దేనిలోనూ చేర్చబడి ఉండకూడదు-ప్రత్యేకంగా హోదా కల్పించబడిన జాతీయుల జాబితా మరియు ట్రెజరీ కార్యాలయం యొక్క యుఎస్ డిపార్ట్‌మెంటుచే రూపొందించబడిన విదేశీ మంజూరీల ఎగవేతదారుల జాబితాతో సహా విదేశీ ఆస్తి నియంత్రణ ("OFAC") మరియు నిరాకరించబడిన వ్యక్తుల జాబితా, వెరిఫై చేయబడని జాబితా మరియు పరిశ్రమ మరియు భద్రతపై వాణిజ్యం యొక్క యుఎస్ డిపార్ట్‌మెంటుచే - లేదా మీరు పనిచేస్తున్న దేశాలలోని ఏదైనా ప్రభుత్వ ప్రాధికార సంస్థచే నిర్వహించబడిన సంస్థల జాబితా; (g) మీరు ఒక వ్యాపారమైతే, అటువంటి నిర్బంధిత పక్షముచే మీరు యాజమాన్యం చేయబడకుండా లేదా నియంత్రించబడకుండా ఉంటే; మరియు (h) OFAC లేదా వర్తించే ఇతర మంజూరుల ద్వారా వాణిజ్యాన్ని నిషేధించిన ఏదైనా దేశ చట్టాల క్రింద మీరు నివసించకుండా ఉంటే లేదా ఏర్పాటు చేయబడకుండా ఉంటే.

సారాంశంలో: ఒక చెల్లింపు ఫీచర్ యొక్క కొనుగోలు మరియు వాడకమునకు షరతుగా మీరు పాటించాల్సిన అవసరం ఉందని మేము కోరే కొన్ని నియమాలు ఉన్నాయి.

11. చెల్లింపు ఫీచర్లు మరియు ధరకు మార్పులు

a. Snap ఏ సమయంలోనైనా, ఏదైనా చెల్లింపు ఫీచర్ల యొక్క స్పెసిఫికేషన్లు, కంటెంట్, ధర, వివరణలు, ప్రయోజనాలు లేదా ఫీచర్లను ఆధునీకరించవచ్చు, సవరించవచ్చు లేదా మార్చవచ్చు మరియు ఏదైనా సంబంధిత ఫీచర్లు, కంటెంట్ లేదా ప్రయోజనాలతో సహా ఎటువంటి నోటీసు, తిరిగి చెల్లింపు లేదా బాధ్యత లేకుండా ఏ సమయంలోనైనా మరియు ఏ కారణం చేతనైనా ఏదైనా చెల్లింపు ఫీచర్ యొక్క లభ్యతను ఆపివేయవచ్చు. మేము మీకు అందుబాటులో ఉంచిన చెల్లింపు ఫీచర్ల యొక్క ఏవైనా వివరణలు,స్పెసిఫికేషన్లు లేదా ధర కూడా మేము ఒక చెల్లింపు ఫీచరుకు చేసిన ఏవైనా అప్‌డేట్లను ప్రతిబింబించడానికి గాను మార్పుకు లోబడి ఉండవచ్చు, కాబట్టి దయచేసి ఈ వనరులను తరచుగా సమీక్షించండి. ఏవైనా వివరణలు, స్పెసిఫికేషన్లు లేదా ధర నిర్ణయాలకు మేము చేసిన ఏదైనా సవరణతో మీరు సంతోషంగా లేనట్లయితే, మీరు చెల్లింపు ఫీచర్ ని ఉపయోగించడం ఆపివేయాలి. 

b. ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ కోసం మేము ధరను మార్చినట్లయితే, అందుకు మేము మీకు సహేతుకమైన ముందస్తు నోటీసును అందిస్తాము. ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ కు ఏదైనా ధర మార్పు అనేది మేము మీకు నోటిఫై చేసిన తేదీ తర్వాత తదుపరి సబ్స్క్రిప్షన్ వ్యవధి ప్రారంభం నుండి అమలు లోనికి వస్తుంది. ఒకవేళ మీరు అట్టి ధర మార్పుతో అంగీకరించనట్లయితే, సెక్షన్ 3 లో ఏర్పాటు చేయబడిన విధంగా ధర మార్పుకు ముందు మీ సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవడానికి మీకు హక్కు ఉంటుంది. ఏదైనా ఇతర చెల్లింపు ఫీచర్‌కు వర్తింపు చేయబడిన ధర మార్పులు ఆ చెల్లింపు ఫీచర్‌కు మీరు ఇదివరకే చేసిన ఏదైనా ఆర్డర్ ను ప్రభావితం చేయవు.

c. మా చెల్లింపు ఫీచర్లకు ఏవైనా మార్పులు, లేదా మేము వాటిని ఎలా అందిస్తాము అనేవాటిని ప్రతిబింబించడానికి అలాగే చట్టపరమైన అవసరాలకు, లేదా ఇతర చట్టపరమైన లేదా భద్రతా కారణాల కోసం మేము ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలను అప్డేట్ చేయవలసి రావచ్చు. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు ఆ మార్పులు గనక వస్తురూపేణా అయి ఉంటే, మేము మీకు సహేతుకమైన ముందస్తు నోటీసును (మార్పులు వెంటనే అవసరమై ఉంటే తప్ప, ఉదాహరణకు, చట్టపరమైన అవసరాలలో ఒక మార్పు ఫలితంగా లేదా మేము కొత్త సేవలు లేదా ఫీచర్లను ప్రారంభించిన చోట) అందజేస్తాము. మార్పులు అమలులోకి వచ్చిన తర్వాత గనక మీరు సేవలను ఉపయోగించడం కొనసాగిస్తే, మేము దానిని మీ స్వీకారముగా తీసుకుంటాము. ఒకవేళ ఏ సమయంలోనైనా మీరు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలకు చేసిన ఏవైనా మార్పులకు అంగీకరించకపోతే, మీరు కొనుగోలు చేసిన ఏవైనా చెల్లింపు ఫీచర్లను ఉపయోగించడం మీరు ఆపివేయాలి.

సారాంశంలో: చెల్లింపు ఫీచర్లు మరియు వాటికి మేము వసూలు చేసే ధర మీ ప్రస్తుత సబ్స్క్రిప్షన్ వ్యవధి యొక్క ధరను లేదా ధర మార్పు అమలు లోనికి రావడానికి ముందు మీరు ఉంచిన ఏదైనా ఇతర చెల్లింపు ఫీచర్ ఆర్డర్ ని ప్రభావితం చేయనప్పటికీ అది ఏదైనా సమయంలో మరియు ఏ కారణం చేతనైనా మారవచ్చు. మేము ఈ నిబంధనలను కొంత కాలానికి అప్డేట్ చేయవచ్చు కూడా, మరియు మీరు గనక ఆ అప్‌డేట్లలో దేనితోనైనా అంగీకరించకపోతే, మీరు చెల్లింపు ఫీచర్లను ఉపయోగించడం వెంటనే ఆపివేయాలి. ఒకవేళ వస్తురూపేణా మార్పులు ఉంటే, మేము మీకు ముందుగానే తెలియజేస్తాము.

12. లభ్యత మరియు లోపాలు

a. మా ఉత్పత్తులు మరియు సేవలను వీలైనంత ఖచ్చితంగా వివరించడానికి మేము మా వంతు కృషి చేస్తున్నప్పుడు, మా చెల్లింపు ఫీచర్లకు ఏవైనా వివరణలు, లక్షణాలు లేదా ధర పూర్తిగా, ఖచ్చితమైనవిగా, ప్రస్తుతమున్నవిగా లేదా లోపాలు లేనివిగా ఉన్నాయని మేము హామీ ఇవ్వము. ఒక చెల్లింపు ఫీచర్ కొరకు ధర లేదా వివరణ లేదా లక్షణాలతో లోపం ఉన్నట్లయితే, సంబంధిత చెల్లింపు ఫీచరు వాడకమును ఆపడం లేదా సంబంధిత చెల్లింపు సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవడం మీ ఏకైక నివారణగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ధర లేదా లక్షణాల లోపం ఉన్నట్లయితే, మా సంపూర్ణ విచక్షణపై మీ ఆర్డరును తిరస్కరించడానికి లేదా రద్దు చేయడానికి మాకు హక్కు ఉంటుంది.

b. వర్తించే చట్టముచే అవసరమై ఉంటే తప్ప, ఏదైనా నిర్దిష్ట చెల్లింపు ఫీచర్, లేదా ఏదైనా ఒక ఫీచర్, కంటెంట్, ప్రయోజనం లేదా ఒక చెల్లింపు ఫీచరుతో ముడిపడి ఉన్న ఫంక్షనాలిటీ అన్ని సమయాల్లోనూ లేదా ఏదైనా చెప్పబడిన సమయములో, అది దోషరహితంగా అందుబాటులో ఉంటుంది లేదా ఆ Snap అనేది ఒక చెల్లింపు ఫీచర్ లేదా ఏదైనా ఫీచర్, కంటెంట్, ప్రయోజనం లేదా ఒక చెల్లింపు ఫీచరుతో ముడిపడి ఉన్న ఫంక్షనాలిటీ అందుబాటుకు ఏదైనా కనీస కాలవ్యవధి పాటు ప్రాప్యతను అందించడం కొనసాగిస్తుంది.

సారాంశములో: చెల్లింపు ఫీచర్లు అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటాయని మేము వాగ్దానం చేయము, మరియు చెల్లింపు ఫీచర్లను స్పష్టంగా వివరించడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాము. అవి వివరించబడిన దానితో మీరు సంతోషంగా లేనట్లయితే, మీరు చెల్లింపు ఫీచరును ఉపయోగించడం ఆపివేయవచ్చు.

13. అంతిమ నిబంధనలు

a. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు ఆంగ్లంలో వ్రాయబడ్డాయి మరియు ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనల యొక్క ఏదైనా అనువదించబడిన వచనము ఆంగ్ల సంస్కరణ తో విభేదించిన పక్షములో అప్పుడు ఆంగ్ల సంస్కరణ నియంత్రిస్తుంది.

b. ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలు ఏవైనా గడువు మీరినా లేదా రద్దు చేయబడినా కూడా ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనల యొక్క విభాగాలు 2-8 మరియు 13-15 అమలులోనే ఉంటాయి.

సంక్షిప్తంగా: నిబంధనల గురించి మీతో మా ఒప్పందం ఆంగ్లంలో ఉంది. మన ఒప్పంద వ్యవధి ముగిసిన తర్వాత కూడా కొన్ని భాగాలు వర్తించడం కొనసాగుతుంది. 

14. మమ్మల్ని సంప్రదించండి

Snap వ్యాఖ్యలు, ప్రశ్నలు, ఆందోళనలు లేదా సూచనలను స్వాగతిస్తుంది. మా Snapchat సపోర్ట్ పేజీని సందర్శించడం ద్వారా దయచేసి మాకు ఫీడ్‌బ్యాక్ పంపించండి, ఐతే మీరు స్వచ్ఛందంగా ఫీడ్‌బ్యాక్ లేదా సూచనలు ఇవ్వాలనుకుంటే, మీకు పరిహారం చెల్లించకుండానే మీ ఆలోచనలను మేము ఉపయోగించుకోవచ్చునని తెలుసుకోండి. మీరు ఏవైనా ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్ తో మమ్మల్ని కలుసుకోవాలనుకుంటే, లేదా ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే:

  • మీరు యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నట్లయితే, మా మెయిలింగ్ చిరునామా: Snap Inc. 3000 31st St., Suite C, Santa Monica, CA 90405.

  • మీరు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, మా మెయిలింగ్ చిరునామా: Snap Group Limited Singapore Branch, #16-03/04, 12 Marina Boulevard, Marina Bay Financial Centre Tower 3, 018982, Singapore. UEN: T20FC0031F. VAT ఐడి : M90373075A.

  • మీరు యునైటెడ్ స్టేట్స్ మరియు ఆసియా-పసిఫిక్ ప్రాంతం వెలుపల నివసిస్తున్నట్లయితే, మా మెయిలింగ్ చిరునామా: Snap గ్రూప్ లిమిటెడ్, ఇంగ్లాండులో రిజిస్టర్ చేయబడిన ఒక కంపెనీ మరియు 50 Cowcross Street, Floor 2, London, EC1M 6AL, యునైటెడ్ కింగ్‌డమ్ యందు కంపెనీ నంబర్ 09763672 తో ఉన్నది. అధీకృత ప్రతినిధి: రోనన్ హారిస్, డైరెక్టర్. VAT ID: GB 237218316.

సంక్షిప్తంగా: మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మేము మా యూజర్ల నుండి వినడానికి ఎప్పుడూ ఇష్టపడతాము. కాని, ఒకవేళ మీరు ఫీడ్‌బ్యాక్ లేదా సూచనలు ఇవ్వదలచినట్లయితే, వాటిని మీకు మేము ఏవిధమైన చెల్లింపు జరపకుండా ఉపయోగించవచ్చని తెలుసుకోండి.

15. దేశ-నిర్దిష్ట నిబంధనలు

మీరు ఒక చెల్లింపు ఫీచరును కొనుగోలు చేసినప్పుడు దిగువ జాబితా చేయబడిన దేశాల్లో దేనిలోనైనా నివసిస్తున్నట్లయితే, ఆ దేశం కోసం జాబితా చేయబడిన అదనపు నిబంధనలు మీకు వర్తిస్తాయి.

యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ మరియు నార్వే:

రద్దు చేసే హక్కులు

ఒకవేళ మీరు ఒక తృతీయ పక్షం కొనుగోలు ప్రొవైడర్ (ఉదా. App Store) ద్వారా మీ చెల్లింపు ఫీచర్ కొనుగోలు చేసినట్లయితే, మీరు రద్దు చేసే మార్గం మరియు రద్దు చేయడం యొక్క హక్కులు ఈ విభాగంలో ఏర్పాటు చేయబడిన వాటికి భిన్నంగా ఉండవచ్చు. అటువంటి సందర్భంలో, మీ కొనుగోలు అనేది వారి కొనుగోలు నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది, కాబట్టి మీరు ఎలా మరియు ఎప్పుడు రద్దు చేయవచ్చో మీరు అర్థం చేసుకున్నట్లుగా చూసుకోవడానికి మీ కొనుగోలు ప్రొవైడర్ ద్వారా మీకు అందించబడిన రద్దు చేయడం యొక్క సూచనలను దయచేసి చదువుకోండి.

ఒకవేళ మీరు యునైటెడ్ కింగ్‌డమ్‌, యూరోపియన్ యూనియన్ లేదా నార్వేలోని ఒక వినియోగదారు నివాసి అయి ఉంటే, చాలా చెల్లింపు ఫీచర్లకై మీరు మీ కొనుగోలు కొరకు మనసును మార్చుకొని మరియు ఒప్పందమును రద్దు చేసుకోవడానికి మీ కొనుగోలు యొక్క తేదీ నుండి 14 రోజుల లోపల ("రద్దు వ్యవధి") చట్టబద్ధమైన హక్కు ఉంటుంది. ఉదాహరణకు, ఒకవేళ మీరు నెల యొక్క 1 వ రోజున ఒక కొనుగోలు చేసినట్లయితే, రద్దు చేయబడే వ్యవధి నెలలో 15వ రోజు ఆఖరున ముగుస్తుంది. రద్దు చేయడానికి ఈ చట్టపరమైన హక్కు అన్ని చెల్లింపు ఫీచర్లకు వర్తించదని దయచేసి గమనించండి. వర్తించే పరిమితులు మరియు మినహాయింపులపై మరిన్ని వివరాలను ఈ విభాగంలో ఆ తరువాత కనుగొనవచ్చు.

రద్దు చేయడానికి మీ హక్కును చెలాయించడానికి గాను, ఇమెయిల్, పోస్ట్ లేదా మా ఆన్‌లైన్ మద్దతు పేజీ ద్వారా (మా సంప్రదింపు వివరాల కోసం విభాగం 14 ను చూడండి) ఒక స్పష్టమైన ప్రకటన ద్వారా మీ నిర్ణయాన్ని మాకు తెలియజేయాలి. ఈ దిగువన అందుబాటులో ఉంచబడిన రద్దు చేసే ఫారమ్‌ను మీరు ఉపయోగించుకోవచ్చు, ఐతే Snapchat లో అందించబడిన రద్దు చేసే సూచనలను అనుసరించడమే రద్దు చేయడానికి సులభమైన మార్గం.

ఒకవేళ ఈ క్రింది విధంగా ఉంటే మీ మనసును మార్చుకోవడానికి మరియు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి మీకు హక్కు ఉండదు: (i) రద్దు చేసుకొనే వ్యవధి సమయంలో డిజిటల్ కంటెంట్‌ను అందించడం ప్రారంభించడానికి మీరు మాకు సమ్మతి ఇచ్చి ఉండి, మరియు ఈ వ్యవధిలో మేము డిజిటల్ కంటెంట్‌ను అందించడం ప్రారంభించి ఉంటే; లేదా (ii) రద్దు చేసుకొను వ్యవధిలో డిజిటల్ సేవలు అందించడం ప్రారంభించాలని మీరు అభ్యర్థించి, మరియు ఈ సమయంలో డిజిటల్ సేవలు సంపూర్ణంగా పూర్తి చేయబడి ఉంటే.

రద్దు చేయడానికి మీ చట్టపరమైన హక్కు ఈ క్రింది విధంగా చెల్లింపు ఫీచర్లకు వర్తిస్తుంది:

  • చెల్లింపు సబ్స్క్రిప్షన్స్ : Snapchat + మరియు ఇతర చెల్లింపు సబ్స్క్రిప్షన్స్ అనేవి డిజిటల్ సేవలు. రద్దు చేసే వ్యవధిలో మీరు ఒక చెల్లింపు సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అలా చేసినట్లయితే, సబ్స్క్రిప్షన్ కోసం మీరు చెల్లింపు చేసిన ధర యొక్క పాక్షిక రిఫండ్ ను మీరు అందుకుంటారు, అది, మీరు సంబంధిత సబ్స్క్రిప్షన్ వ్యవధిలో ఎన్ని రోజులు వాడకాన్ని ఆనందించారో దాని ఆధారంగా ప్రోరేట్ చేయబడుతుంది. ఉదాహరణకు, ఒకవేళ మీరు ఒక నెలవారీ సబ్స్క్రిప్షన్ లోనికి ఏడు రోజులను రద్దు చేసుకున్నట్లయితే, ఏడు రోజుల వాడకమునకు సమానమైన మొత్తమును తగ్గించుకొని మీరు చెల్లింపు చేసిన సబ్స్క్రిప్షన్ రుసుమును మేము మీకు రిఫండ్ చేస్తాము. ఒకవేళ మీరు UK లో నివసిస్తున్నట్లయితే: (i) ఒకవేళ మీకు తొలి ఉచిత ప్రయత్నం లేదా రాయితీ వ్యవధి ఉంటే, సబ్స్క్రిప్షన్ ఒక పూర్తి-ధర సబ్స్క్రిప్షన్ లోనికి మారినప్పుడు ఒక కొత్త రద్దు వ్యవధి వర్తిస్తుంది; మరియు (ii) ఒకవేళ మీరు వార్షిక సబ్స్క్రిప్షన్ కలిగి ఉంటే, ఏ ఆటోమేటిక్ వార్షిక నవీకరణలకైనా ఒక కొత్త రద్దు వ్యవధి వర్తిస్తుంది. ప్రతి సందర్భంలోనూ, కొత్త రద్దు వ్యవధి అనేది పూర్తి-ధర సబ్స్క్రిప్షన్ చేయబడిన లేదా నవీకరణ మొదలైన రోజున మొదలవుతుంది మరియు 14 రోజుల తరువాత ముగుస్తుంది (ఉదా. ఒకవేళ ప్రారంభ తేదీ 1 జనవరి అయి ఉంటే, ముగింపు తేదీ 15 జనవరి అవుతుంది).

  • టోకెన్‌లు: టోకెన్‌లు అనేవి డిజిటల్ సేవలు. మీరు టోకెన్‌లను వాడుకోనంత కాలమూ రద్దు చేసుకొను వ్యవధి సమయంలో మీరు వాటిని కొనుగోలు చేయడాన్ని రద్దు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ టోకెన్‌ల కొనుగోలును రద్దు చేసుకున్నట్లయితే, కొనుగోలు యొక్క భాగంగా ఏర్పరచబడినట్లుగా వాడని టోకెన్‌లకు మీరు రిఫండ్ ను అందుకుంటారు. ఉదాహరణకు, మీరు కొనుగోలు చేసిన టోకెన్‌లు ఏ ఒక్కదానినీ మీరు ఉపయోగించకుంటే, ఆ టోకెన్‌లు కొనుగోలు చేసిన డబ్బును మేము మీకు పూర్తి రిఫండ్ చేస్తాము. ఒకవేళ మీరు కొనుగోలు చేసిన టోకెన్‌లు సగాన్ని ఉపయోగించినట్లయితే, మేము మీరు చెల్లింపు చేసిన ధర యొక్క 50% ను రిఫండ్ చేస్తాము. మీరు ఇప్పటికే ఉపయోగించిన టోకెన్‌ల కొనుగోలును మీరు రద్దు చేయజాలరనీ, మరియు మీకు ఉచితంగా లేదా ప్రొమోషన్ యొక్క భాగంగా జారీ చేయబడిన టోకెన్‌లు వంటి మీరు చెల్లింపు చేయని టోకెన్‌ల కోసం మేము రిఫండ్ ను జారీ చేయమనీ దయచేసి గమనించండి.

  • Snap స్ట్రీక్ రిస్టోర్‌లు మరియు అటువంటి డిజిటల్ సేవలు: ఒక Snap స్ట్రీక్ రిస్టోర్ అనేది ఒక సేవ. కొనుగోలు చేసిన వెంటనే సేవ (మీ Snap స్ట్రీక్ యొక్క పునఃస్థాపన) పూర్తి చేయబడి ఉంటుంది కాబట్టి అది రద్దు చేయబడజాలదు. కొనుగోలు చేసిన వెంటనే సంపూర్ణంగా పూర్తి చేయబడిన ఇతర డిజిటల్ సేవలకు కూడా అదే వర్తిస్తుంది.

  • డిజిటల్ కంటెంట్: డిజిటల్ కంటెంట్ రద్దు కొనుగోళ్ళు చేయబడజాలవు. మీరు డిజిటల్ కంటెంట్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు, వెంటనే డిజిటల్ కంటెంట్‌ను అందించడం ప్రారంభించడానికి మీరు మాకు సమ్మతిని ఇస్తున్నారు.

ఒకవేళ మీరు ఒక రిఫండ్ కు అర్హత పొంది ఉంటే, తొలి లావాదేవీకి మీరు ఉపయోగించినట్టి చెల్లింపు యొక్క అదే మార్గాన్ని ఉపయోగించి మీ నుండి రద్దు చేయడం యొక్క నోటీసు అందుకున్న 14 రోజుల లోపున మేము మీకు రిఫండ్ ను చెల్లిస్తాము.

క్యాన్సిలేషన్ ఫారం

Snap Group Limitedకు,

చిరునామా: Snap Group Limited 50 Cowcross Street, Floor 2, London, EC1M 6AL, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా మమ్మల్ని సంప్రదించండి: ఇక్కడ.

నేను/మేము[*] ఇందుమూలంగా ఇచ్చే నోటీస్ ఏమనగా నేను/మేము [*] నా/మా [*] దిగువ గూడ్స్ కొరకు [*]/దిగువ సర్వీస్ యొక్క సప్లై కొరకు మా అమ్మకపు కాంట్రాక్ట్‌[*],

ఆర్డర్ చేసినది[*]/అందుకున్న తేదీ [*]ని రద్దు చేస్తున్నాం,

వినియోగదారు(లు) యొక్క పేరు,

వినియోగదారు(లు) చిరునామా,

వినియోగదారు(లు) యొక్క సంతకాలు (ఒకవేళ ఈ ఫారం పేపర్‌పై నోటిఫై చేయబడినట్లయితేనే),

తేదీ

[*] తగినవిధంగా డిలీట్ చేయండి

బెల్జియం (పై "యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ మరియు నార్వే" క్రింద ఏర్పాటు చేసిన వాటికి అదనంగా):

ఇక్కడ, Snap చెల్లింపు ఫీచర్ నిబంధనలు, మీకు ముందస్తు నోటీసు లేదా బాధ్యత లేకుండా ఒక చెల్లింపు ఫీచర్ కు మీ ప్రాప్యతను వెంటనే ఆపివేసే, నిలిపివేసే, లేదా రద్దు చేసే Snap హక్కును సూచిస్తాయి, ఒక కోర్ట్ లేదా ట్రిబ్యునల్ యొక్క ముందస్తు జోక్యం లేకుండా ఇది మీతో మన ఒప్పందం యొక్క ఏకపక్ష రద్దును ఏర్పరుస్తుంది.

ఫ్రాన్స్ (పై "యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ మరియు నార్వే" క్రింద ఏర్పాటు చేసిన వాటికి అదనంగా):

కోడ్ డి లా కన్సోమేషన్‌కు అనుగుణంగా, మా మధ్య వివాదాలను పరిష్కరించడం కొరకు వినియోగదారుల మధ్యవర్తిత్వానికి మీరు అర్హులు. మీరు http://www.economie.gouv.fr/mediation-conso/saisir-mediateur “కామర్స్ électronique - Vente à distance” క్రింద జాబితా చేయబడిన మధ్యవర్తులలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. వారి కాంటాక్ట్ వివరాలు ఇక్కడ ఉన్న వ్యక్తిగత మధ్యవర్తిత్వ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి.

జర్మనీ (పై "యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ మరియు నార్వే" క్రింద ఏర్పాటు చేసిన వాటికి అదనంగా):

ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో కలిగి ఉన్నది ఏదీ మీకు తప్పనిసరి జర్మన్ చట్టం క్రింద మీకు అందించబడిన మీ చట్టపరమైన హక్కులను ప్రభావితం చేయదు, ప్రత్యేకించి సెక్షన్ 327 pp జర్మన్ సివిల్ కోడ్ (BGB) మరియు సెక్షన్లు 305 pp కి సంబంధించిన సాధారణ షరతులు మరియు నిబంధనల ప్రకారం డిజిటల్ ఉత్పత్తులు మరియు డిజిటల్ సేవలపై జర్మన్ చట్టం నిబంధనలు మీ చట్టపరమైన హక్కులను ప్రభావితం చేయవు. జర్మన్ సివిల్ కోడ్ (BGB) (ప్రతి ఒక్కటి కాలానుగుణంగా సవరించబడింది లేదా భర్తీ చేయబడుతుంది).

నెదర్లాండ్స్ (పై "యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ మరియు నార్వే" క్రింద ఏర్పాటు చేసిన వాటికి అదనంగా):

ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో కలిగి ఉన్నది ఏదీ, ఆర్టికల్స్ 7:50aa – 50 ap DCC మరియు ఆర్టికల్స్ 6:231-247 DCC కి సంబంధించి డిజిటల్ ఉత్పత్తులు మరియు డిజిటల్ సేవలపై సాధారణ షరతులు మరియు నిబంధనలతో సహా, ఎటువంటి పరిమితి లేకుండా, మీకు తప్పనిసరి డచ్ చట్టం క్రింద మీకు ఉన్న మరియు/లేదా మీకు అందుబాటులో ఉన్న మీ చట్టపరమైన హక్కులు మరియు నివారణలను ప్రభావితం చేయదు.

యునైటెడ్ కింగ్‌డమ్ (పై "యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్ మరియు నార్వే" క్రింద ఏర్పాటు చేసిన వాటికి అదనంగా):

ఈ విభాగంలో లేదా ఈ Snap చెల్లింపు ఫీచర్ల నిబంధనలలో కలిగియున్నది ఏదీ కూడా, ఒప్పందం యొక్క అవసరాలను తీర్చలేని ఏవైనా చెల్లింపు ఫీచర్లకు సంబంధించి మీ చట్టపరమైన హక్కులను ప్రభావితం చేయదు లేదా వినియోగదారు హక్కుల చట్టం 2015 వంటి UK వినియోగదారు హక్కుల చట్టాలను ఉల్లంఘించదు. ఇది ఉదాహరణకు, అవి లోపభూయిష్టంగా లేదా తప్పుగా వివరించబడిన చోట జరుగుతుంది. ఒప్పందానికి అనుగుణమైన చెల్లింపు ఫీచర్లను అందించే ఒక చట్టపరమైన విధికి మేము కట్టుబడి ఉన్నాము. మీరు కొనుగోలు చేసిన ఏవైనా చెల్లింపు ఫీచర్లతో ఏదో తప్పు జరిగిందని మీరు విశ్వసిస్తే, సెక్షన్ 14 లోని సంప్రదింపు వివరాలను ఉపయోగించి దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీ వినియోగదారు హక్కుల గురించి సవివరమైన సమాచారం కోసం, దయచేసి www.adviceguide.org.uk వద్ద పౌరుల సలహా వెబ్‌సైటును సందర్శించండి లేదా 0808 223 1133 కి కాల్ చేయండి.