పరిమిత డేటా వినియోగ నిబంధనలు

అమల్లోనికి వచ్చేది: 3 నవంబర్, 2021

దయచేసి గమనించండి: మేము ఈ నిబంధనలను పైన తెలిపిన తేదీ నుండి అప్‌డేట్ చేశాము. ఒకవేళ మీరు ఈ నియమాల ఇంతకుముందరి వెర్షన్‌కు అంగీకరించినట్లయితే (ఇక్కడ లభ్యమవుతాయి), అప్‌డేట్ చేయబడిన నిబంధనలు 17 నవంబర్, 2021 నుండి అమల్లో ఉంటాయి.

పరిచయం

ఈ పరిమిత డేటా వినియోగ నిబంధనలు మీకు మరియు Snapకి మధ్య చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి మరియు వ్యాపార సేవల నిబంధనలలోచేర్చబడినాయి. ఈ పరిమిత డేటా వినియోగ నిబంధనలలోని కొన్ని నియమాలు, వ్యాపార సేవల నిబంధనలలో నిర్వచించబడినాయి.

1. పరిమిత డేటా వినియోగం

Snap మార్పిడి నిబంధనలలో Snap గౌరవించే ఒక పరిమిత డేటా వినియోగ సిగ్నల్‌ క్రింద (ఇక్కడ వివరించినట్లుగా) ఒకవేళ మీ మొబైల్ యాప్స్ లేదా వెబ్‌సైట్లకు సంబంధించిన ఈవెంట్ డేటా ఉన్నట్లయితే, వినియోగదారుని డివైజ్‌ను, ఏవిధమైన గుర్తించదగిన యూజర్‌కు లింక్ చేయదని లేదా ఆ ఈవెంట్ డేటాలోని డివైజ్ డేటాను గుర్తించదగిన ఎవరైనా యూజర్ లేదా లక్షిత వ్యాపార అడ్వర్టైజింగ్ లేదా ప్రకటనలను అంచనా వేసేందుకు సేకరించిన యూజర్ డేటాను లింక్ చేయదని Snap అంగీకరిస్తుంది.

2. వివాదం

ఒకవేళ ఈ పరిమిత డేటా వినియోగ నిబంధనలు, వ్యాపార సేవల నిబంధనలు , ఏవైనా దాని అనుబంధ నియమాలు మరియు పాలసీలు లేదా Snap సేవా నిబంధనలతో విభేదించినట్లయితే, అప్పుడు విభేదించే డాక్యుమెంట్ల విభేదం మేరకు, ఈ అవరోహణ క్రమంలో ఉంటాయి: ఈ పరిమిత డేటా వినియోగ నిబంధనలు, ఇతర అనుబంధ నిబంధనలు మరియు పాలసీలు, వ్యాపార సేవల నిబంధనలు మరియు Snap సేవా నిబంధనలు.